గుంటూరు జిల్లా అమరావతిలో దారుణం చోటు చేసుకుంది. తెలంగాణాకు చెందిన తండ్రీ,కొడుకు దారుణహత్యకు గురయ్యారు.ఇద్దరినీ గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా చంపి గోతిలో పూడ్చిపెట్టారు. మృతులు నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మేళ్లవాయి గ్రామానికి చెందిన వేముల లక్ష్మయ్య, వేముల సురేష్‌గా గుర్తించారు.
వీరు అమరావతిలో రాజధాని రోడ్ల నిర్మాణం చేస్తున్న మెఘా ఇంజనీరింగ్ కంపెనీకి తమ ప్రొక్లయినర్‌ను అద్దెకి ఇచ్చారు. ఈ క్రమంలో పనులను పరిశీలించేందుకు మూడు రోజుల క్రితం రాజధానికి వచ్చారు. తమ ప్రొక్లెయినర్‌కు జార్ఖండ్‌కు చెందిన వ్యక్తిని డ్రైవర్‌గా పెట్టుకున్నారు.
రెండు రోజులుగా డ్రైవర్ కనిపించక పోవడంతో…. అనుమానంతో ఓ చోట తవ్వించగా మృతుల శవాలు బయటపడ్డాయి. ప్రొక్లెయిన్ డ్రైవరే ఇద్దరినీ చంపి పూడ్చి పెట్టి ఆ తర్వాత పరారై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
