Saturday, May 4, 2024
- Advertisement -

మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు షాక్ ఇచ్చిన కేంద్ర బ‌డ్జెట్‌

- Advertisement -

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను పార్ల‌మెంట్‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టారు. మధ్యతరగతి ప్రజలకు వరాలు కురిపిస్తుందనుకున్న బడ్జెట్ వారిపై పన్నుల భారం మోపింది. పెట్రోలు, డీజిల్, బంగారం ధరలపై కస్టమ్స్ సుంకాన్ని పెంచి మధ్యతరగతిపై కొరడా ఝళిపించింది.

2019 బ‌డ్జెట్ ముఖ్యాంశాలు….

:ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ. 7 లక్షల కోట్లకుపైగా పెరిగింది
:రూ. 11.37 లక్షల కోట్లకు చేరిన ప్రత్యక్ష పన్నుల ఆదాయం
:రూ. 400 కోట్ల టర్నోవర్‌ ఉన్న సంస్థలకు 25శాతం కార్పొరేట్‌ పన్ను మినహాయింపు
:తగ్గనున్న ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు
ఎలక్ట్రిక్‌ వాహనాలు కొంటే ఆదాయపన్ను మినహాయింపు
:స్టార్‌అప్‌లకు ఐటీ పరిశీలన నుంచి మినహాయింపు
:తగ్గనున్న గృహ రుణాల వడ్డీ
:గృహ రుణాలపై అదనంగా రూ. లక్షన్నర వడ్డీ తగ్గింపు
:రూ. 45 లక్షలలోపు గృహరుణాలపై మొత్తంగా రూ. 3.5 లక్షల వడ్డీ రాయితీ
:ప్యాన్‌ కార్డుకు బదులు ఆధార్‌ కార్డు..
:ఇకపై ఆధార్‌ కార్డు లేదా ప్యాన్‌ కార్డుతో ఐటీ రిటర్న్స్‌ చెల్లించవచ్చు
;ఏడాదికి బ్యాంక్‌ నుంచి నగదు విత్‌డ్రాయల్స్‌ కోటి దాటితే రెండు శాతం టీడీఎస్‌ పన్ను
:డిజిటల్‌ లావాదేవీలను పెంచేదిశగా ఈ మేరకు చర్యలు
:వినియోగదారుల డిజిటల్‌ పేమెంట్స్‌పై చార్జీల ఎత్తివేత
:రూ. 2 కోట్ల వార్షిక ఆదాయం దాటిన వారిపై 3శాతం సర్‌చార్జ్‌
:ఆదాయ పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు
:మహిళల నాయకత్వానికి ప్రోత్సాహం కల్పిస్తాం
:ముద్ర పథకం కింద స్వయం సహాయక సంఘాలకు రూ. లక్ష రుణం
:మహిళల ఆర్థిక స్వావలంబన, వారు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ‘నారీ-నారాయణ’ పథకం
:జన్‌ధన్‌ ఖాతా ఉన్న మహిళలకు రూ. 5వేలు ఓవర్‌ డ్రాఫ్ట్‌ తీసుకునే సౌకర్యం కల్పిస్తాం
:బ్యాంకింగ్‌ రంగంలో ప్రక్షాళన చేపడుతాం
:బ్యాంకింగ్‌ రంగంలో నిరర్థక ఆస్తులు రూ. లక్ష కోట్లకు తగ్గాయి
:నాలుగేళ్లలో రూ. 4 లక్షల కోట్ల నిరర్ధక ఆస్తులు రికవరీ చేశాం
:పెట్టుబడులు పెంచేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70వేల కోట్లు కేటాయిస్తున్నాం
:నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలకు ప్రాధాన్యం.. ఎన్‌బీఎఫ్‌సీలకు వన్‌ టైం క్రెడిట్‌ గ్యారెంటీ కల్పిస్తాం
:స్టార్ట్‌అప్‌ల కోసం ప్రత్యేక దూరదర్శన్‌ టీవీ చానల్‌
:స్టాండప్‌ ఇండియా పథకం కింద బలహీన వర్గాల యువతకు శిక్షణ ఇస్తాం
:ఇళ్లలో వాడిన నీటిని పునర్వినియోగం కింద సాగునీరుగా మార్చి పంటలకు మళ్లిస్తాం
:భారతీయ పాస్‌పోర్టు ఉన్న ఎన్నారైలందరికీ ఆధార్‌ కార్డుల కేటాయింపు
;ఎన్‌ఆర్‌ఐలు 180 రోజులు ఎదురుచూడకుండా సత్వరమే ఆధార్‌ కార్డులు
:కొత్తగా 18 దేశాల్లో భారతీయ ఎంబసీల ఏర్పాటు
:2019-20లో కొత్తగా నాలుగు ఎంబసీలు ఏర్పాటు చేస్తాం
:17 ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం
:మౌలిక రంగం అభివృద్ధికి ఐడియాస్‌ స్కీం తీసుకొస్తాం
:ఆదివాసీ, గిరిజనుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను డిజిటల్‌రూపంలో భద్రపరుస్తాం
:ఉజ్వలా ఇండియా పథకం కింద 35 కోట్ల ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ
:ఎల్‌ఈడీ బల్బులతో రూ. 18,341 కోట్లు మిగులు
:పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్య ప్రాజెక్టులు మరిన్ని పెంచుతాం
:పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో అమెరికా, చైనా తర్వాత భారత్‌ నిలిచింది
:వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుంది
:ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పిస్తాం
:రిజర్వ్‌ బ్యాంక్‌ పరిధిలోకి హౌసింగ్‌ ఫైనాన్స్‌ సెక్టార్‌
:ప్రపంచంలోనే భారత్‌ సరికొత్త అంతరిక్ష శక్తిగా అవతరిస్తోంది
:ఇస్రో సేవలను వాణిజ్యపరంగానూ వృద్ధి చేసేందుకు ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేస్తున్నాం
:స్టాక్‌ మార్కెట్‌లో ఎన్నారైలూ పెట్టుబడులు పెట్టేందుకు వెసులుబాటు కల్పిస్తాం
:ఉన్నత విద్యాకేంద్రంగా ఎదిగేందుకు భారత్‌కు ఎన్నో అవకాశాలు
:మన ఉన్నత విద్యాసంస్థల్లోకి విదేశీ విద్యార్థులు రాక మరింత పెరగాలి
:స్టడీ ఇన్‌ ఇండియా పథకంలో భాగంగా విదేశీ విద్యార్థులు ఇక్కడ చదివే అవకాశం
:ఏడాదిలోగా ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటు
:శాస్త్ర సాంకేతిక రంగంలో జాతీయ పరిశోధన సంస్థ ఏర్పాటు
:ఖేలో ఇండియా ద్వారా దేశవ్యాప్తంగా క్రీడలకు ప్రోత్సాహం
:దేశవ్యాప్తంగా మెట్రో రైలు సర్వీసులను మరో 300 కిలోమీటర్ల మేర పెంచుతాం
:ప్రస్తుతం దేశవ్యాప్తంగా 650 కిలోమీటర్ల మెట్రోమార్గం అందుబాటులో ఉంది
:అక్టోబర్‌ 2 నాటికి దేశవ్యాప్తంగా బహిరంగ మలమూత విసర్జనను నిషేధిస్తాం
:విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునేవారికి ప్రత్యేక శిక్షణ ఇస్తాం
:పల్లెలు, పెదలు, రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టాం..
:లక్షా25వేల కిలోమీటర్ల రహదారిని అభివృద్ధి చేస్తాం
:పర్యావరణహితంగా 30 వేల కిలోమీటరల​ రహదారిని మార్చుతాం
:దేశవ్యాప్తంగా సురక్షిత తాగునీరు అందిస్తాం
:దేశవ్యాప్తంగా 256 జిల్లాలలో జలశక్తి అభియాన్‌ పథకం అమలు చేస్తాం
:2020లో ప్రతి పల్లెలో ప్రతి ఇంటికి తారునీరు అందిస్తాం
:రైతుల ఆదాయం రెండింతలు చేసే విధానాలు అమలుచేస్తాం
:పెట్టుబడి లేకుండా వ్యవసాయ పథకం.. ఈ పథకం కింద రైతులకు శిక్షణ ఇస్తాం
:మూడేళ్లలో విద్యుత్‌, ఎల్పీజీ గ్యాస్‌ సౌకర్యం లేని ఇల్లు ఉండదు
:పేదలకు ఇల్లు నిర్మించే గడువును 114 రోజులకు తగ్గింపు
:ఇక దేశవ్యాప్తంగా అన్ని ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణానికి ఒకే కార్డును ప్రవేశపెడతాం
:ఒకే కార్డుతో బస్సు, రైలు, విమానం, మెట్రోల్లో ప్రయాణం చేసే సౌలభ్యం కల్పిస్తాం
:ఒకే గ్రిడ్‌ కిందకి అన్ని రాష్ట్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాను తీసుకొస్తాం
:పేద, మధ్యరగతి వర్గాలకు తక్కువ ధరకు గృహ సదుపాయం కల్పిస్తాం
:గ్రామాలను పట్టణాలతో అనుసంధానం చేయడానికే భారత్‌ మాల పథకం
:అద్దెకుండే వారి హక్కుల పరిరక్షణకు కొత్త చట్టం తీసుకొస్తాం
:దేశవ్యాప్తంగా మూడు కోట్లమంది చిన్న వ్యాపారులకు పెన్షన్‌ సౌకర్యం కల్పిస్తాం
:ఐదేళ్లలో మనం సాధించిన పేటెంట్ల సంఖ్య మూడు రెట్లకు పెరిగింది
:బలమైన దేశం కోసం.. బలమైన పౌరుడు అనే విధానంతో ముందుకెళ్తాం
:లక్ష్యసాధనలో నమ్మకముంటే ఏదో ఒక మార్గం దొరుకుతుంది
:బలమైన గాలులు వీచినా దీపం వెలుగుతుంది
:ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించే దిశగా సాగుతున్నాం
:సంస్కరణలు, పనితీరు, మార్పు దిశగా ముందుకెళ్లడం మా విధానం
:మా ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో ఉపాధి, ఉద్యోగ కల్పన కీలకం
:మేకిన్‌ ఇండియాను మా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది
తక్కువ అధికారం, ఎక్కువ పరిపాలన పద్ధతిలో నడుస్తున్నాం
:భారత్‌ ఇంజినీరింగ్‌ సామర్థ్యాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటాం
:ఎలక్ట్రిక్‌ బైక్‌లు, కార్లు, వాహనాలు కొనేవారికి రాయితీలు కల్పిస్తాం
:అంతర్గత నదీ జలరవాణాను అభివృద్ధి చేసి రవాణాకు వినియోగిస్తాం
:గంగానదిలో ప్రస్తుతం చేస్తున్న జలరవాణాను నాలుగింతలు పెంచుతాం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -