పాక్ ఉగ్ర‌వాద దాస్ప్ర‌చారాన్ని కాశ్మీర్ యువ‌త తిప్పికొట్టాలి ఆర్మీ ఛీప్ రావ‌త్‌…

Unite against killing of Lieutenant Ummer Fayaz says army chief ravath

పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్ర‌వాదాన్ని కాశ్మీర్ యువ‌త తిప్పికొట్టాల్సిన స‌మ‌యం అస‌న్న‌మైంద‌ని భార‌త్ ఆర్మీ ఛేప్ బిపిన్ రావ‌త్ పిలుపు నిచ్చారు.లెఫ్టినెంట్‌ ఉమర్‌ ఫయాజ్‌ను పాక్‌ బలగాలు అక్రమంగా హత్య చేసిన విషయాన్నిగుర్తు చేశారు.

కాశ్మీర్‌లో ఉగ్ర‌వాదాన్నిపాక్ పెంచి పోషించేదానికి కుట్ర‌లు ప‌న్నుతోంద‌ని …వాటిలో కాశ్మీర్ యువ‌త బ‌లికావ‌ద్ద‌ని …. సోషల్‌ మీడియాలో దాన్ని తిప్పికొట్టాల‌ని పిలుపునిచ్చారు.
లెఫ్టినెంట్‌ ఫయాజ్‌ కశ్మీర్‌ లోయకు చెందిన వీర జవాను. ఎంతో కష్టపడి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో చోటు సంపాధించుకున్నాడు.

{loadmodule mod_custom,Side Ad 1}

గత ఏడాది డిసెంబర్‌లో రాజ్‌పుటానా రైఫిల్స్‌లో బాధ్యతలు చేపట్టాడు. అతడు చాలా ధైర్యంగల యువకుడు.. ఓ వివాహం వేడుక చూసేందుకు ఇంటికెళ్లాడు. పండుగకు వెళ్లిన ఆ వీర జవానును క్రూరంగా చంపేశారు’ అని ఆర్మీ చీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈవిష‌యంలో క‌శ్మీర్ యువ‌త త‌ప్ప‌నిస‌రిగా జోక్యం చేసుకోవాల‌న్నారు. ఎవరు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారో దాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత వారిపై ఉందని గుర్తు రావ‌త్ గుర్తు చేశారు.

Related

  1. మావోలు ఆయుధ ప్ర‌ద‌ర్శ‌న‌
  2. ఉగ్ర‌దాడులు జ‌ర‌గ‌చ్చు భార‌త్‌ను హెచ్చ‌రించి అమెరికా ఇంట‌లిజెన్సీ
  3. ఏక్ష‌ణ‌మైనా యుద్ధం ప్రారంభం…
  4. కుల‌భూష‌న్ మ‌ర‌ణ శిక్ష‌పై స్టే….