Monday, April 29, 2024
- Advertisement -

సినీమా రికార్డ్స్ బ్రేక్ చేసిన మాస్క్ లేని ప్రజలు..!

- Advertisement -

తెలంగాణ లో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నివేదికలో పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 273 మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశామని వెల్లడించింది. ప్రస్తుతం 17 ఆర్టీపీసీఆర్​ ల్యాబ్​లతో పాటు మరో 14 ల్యాబ్​ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని… రెండు వారాల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపింది.

విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేస్తున్నామని ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి 14 వరకు 94,910 మందికి పరీక్షలు నిర్వహించగా… 681 మందికి పాజిటివ్ వచ్చినట్లు స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 33 రాపిడ్ రెస్పాన్స్ బృందాలు ఏర్పాటు చేశామని వెల్లడించింది.

కొవిడ్ నిబంధనల ఉల్లంఘనులపై డీజీపీ మహేందర్ రెడ్డి నివేదిక సమర్పించారు. మాస్కులు ధరించని 57,907 మందిపై 15 రోజుల్లో కేసులు నమోదు చేశామని వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా గుమిగూడిన 159 మంది అరెస్టు చేశామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిబంధనల అతిక్రమించే వారిని గుర్తిస్తున్నామని స్పష్టం చేశారు.

బైక్ పై ఎన్టీఆర్ తనయుడితో చక్కర్లు.. ఫోటో వైరల్

అసోం మాజీ ముఖ్యమంత్రి భూమిధర్​బర్మన్ కన్నుమూత

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..!

హై కోర్టు వరుస ప్రశ్నలు.. కరోనా కి బార్ లకి ఏమిటి లింక్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -