Saturday, April 20, 2024
- Advertisement -

ఉగ్ర‌దాడిపై అనుమానాలున్నాయ‌న్న మ‌మ‌త‌

- Advertisement -

పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడిలో పారిన ర‌క్త‌పుటేరులు ఇంకా పూర్తిగా ఎండనైనా లేదు… ఓ వైపు యావత్ భారత రగిలిపోతోంది. 40 మంది అమరుల త్యాగాలను ఇంకా మ‌రిచిపోలేదు. వారి కుటుంబాలు చేస్తున్న‌ రోద‌న‌లు ఇంకా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఈ ఘాతుకానికి పాల్ప‌డిన వారిపై దేశం యావ‌త్తు ప్ర‌తీకారం కోరుకుంటుంది. కానీ అప్పుడే ఉగ్ర‌దాడిపై రాజ‌కీయం మొద‌లైంది. ఈ ఘ‌ట‌న‌పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ముందే ఉగ్ర‌దాడి జ‌ర‌గ‌డంతో త‌మ‌కు చాలా అనుమానాలున్నాయ‌ని సెల‌విచ్చారు దీదీ. ఎన్నికల ముందు జరిగిన ఉగ్రదాడిపై మాకు ఎన్నో అనుమానాలున్నాయి.

గత ఐదేళ్లలో పాకిస్తాన్ ప్రభుత్వంపై భారత్ ఎందుకు చర్యలు తీసుకోలేదు.? తామే నిజమైన దేశభక్తులుగా మోదీ, అమిత్ షా ప్రజల్లోకి వెళ్లి ప్రసంగాలు చేస్తున్నారంటూ మ‌మ‌తా ఫైర్ అవుతున్నారు. అంటే బీజేపీ ప్ర‌భుత్వ‌మే అదిల్ అనే ఉగ్ర‌వాదికి దాడి చేయ‌మ‌ని చెప్పిందా? లేక మ‌సూద్ అజ‌ర్‌- అమిత్ షా క‌లిసి ప్లాన్ చేశారు అని చెప్ప‌ల‌నుకుంటున్నారా అనేది క్లారిటీ లేదు కానీ.. సైనికుల మ‌ర‌ణాల‌పై రాజ‌కీయం చేయ‌డం మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు ప్ర‌జ‌లు. ఇది వారికి పొలిటిక‌ల్‌గా ఎంత మైలేజ్ తెస్తుందో కానీ డ్యామేజీ మాత్రం త‌ప్ప‌నిస‌రి అనిపిస్తుంది.దీనికంటే ఉగ్ర‌వాదంపై పోరులో మోదీ ప్ర‌భుత్వం క‌లిసి న‌డుస్తామ‌ని చెప్పినా కొంత సాఫ్ట్ కార్న‌ర్ వ‌చ్చేదేమో! లేక‌ దేశ‌భ‌క్తిపై పేటేంట్ తీసుకున్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ మోదీ, అమిత్ షా ప్లాన్‌కు గండి కొడుతూ తామే నిజ‌మైన దేశ భ‌క్తుల‌మ‌ని ప్రూవ్ చేసుకునే విధంగా ఏదైనా చేసుంటే తృణ‌మూల్‌కు కూడా ఉప‌యోగ‌ప‌డేది కదా అంటున్నారు జ‌నాలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -