Friday, May 24, 2024
- Advertisement -

టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్‌కు బిగ్ షాక్ ఇచ్చిన వాట్స‌ప్ ..ఇది కేంద్రం ప‌నే

- Advertisement -

టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్‌కు వాట్స‌ప్ బిగ్ షాక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయన వాట్సాప్ అకౌంట్‌ను రద్దు చేసింది. తన వాట్సాప్ ఖాతా పనిచేయడం లేదని రమేశ్ ఇచ్చిన ఫిర్యాదుకు ఆ సంస్థ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. మీరు వాట్సాప్ సేవలు వాడుకునేందుకు అర్హత కోల్పోయారంటూ ఆ సంస్థ చెప్పడంతో ఆయన షాక్‌కు గురయ్యారు.

ఆయన ఖాతాపై అనేక ఫిర్యాదులు రావడంతో పరిశీలించి చివరకు బ్యాన్ చేసినట్లు వాట్స‌ప్ యాజ‌మాన్యం చెప్పింది. అయితే కంప్లైంట్స్ ఎవరిచ్చారు, ఎందుకిచ్చారు అన్న దానిపై మాత్రం యాజమాన్యం స్పష్టత ఇవ్వలేదు. వినియోగదారుల వ్యక్తిగత గోప్యత కాపాడే చర్యల్లో భాగంగా ఆ వివరాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

దీంతో ర‌మేష్ కేంద్రంపై ఆరోప‌న‌లు చేశారు. ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం కావాలనే తనపై ఇలాంటి కుట్రలు చేస్తోందని సీఎం రమేష్ ఆరోపించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం పెరిగిన తర్వాత రోజురోజుకూ టీడీపీ, బీజేపీ మధ్య మాట యుద్ధం పెరిగింది. ఇలాంటి సమయంలో రమేష్‌ ఖాతా నిలిపి వేయడం చర్చనీయాంశంగా మారింది.

వివాదాస్పద రాజకీయ పోస్టులు, కామెంట్లపై కఠినంగా వ్యవహరించనున్నట్లు సోషల్ మీడియా సంస్థలు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా వాట్సాప్, ఫేస్ బుక్ సంస్థలు ఈ విషయంలో సీరియస్ గా వున్నాయి. ర‌మేష్ వాట్స్‌ప్ సేవ‌లు నిలిపివేయ‌డం ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -