- Advertisement -

పవనన్నా…ప్లీజ్‌ కాపాడండన్నా!

- Advertisement -

పవనన్నా.. మీరే నన్ను కాపాడాలి. ఇక్కడ నన్ను చంపేస్తారేమోనని భయంగా ఉంది. నా ముగ్గురు బిడ్డలను తలుచుకుంటే గుండె తరుక్కుపోతోంది.. అంటూ మస్కట్‌లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ మహిళ పంపిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆమె వేడుకుంటున్న తీరు ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది.

అన్నమయ్య జిల్లాకు చెందిన సదరు మహిళ, కుటుంబ పోషణ నిమిత్తం ఉపాధి కోసం కొద్ది నెలల క్రితం మస్కట్ వెళ్ళింది. అయితే, అక్కడ ఆమె కలలు కన్నట్లుగా పని దొరకకపోగా, చేరిన చోట యజమాని ఆమెను బానిసలా చూస్తున్నాడు. నిత్యం శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ మహిళ వెల్లడించిన వివరాల ప్రకారం..యజమాని ఆమెను ఒక ఇరుకైన గదిలో బంధించి బయటకు రాకుండా నిర్బంధించాడు.కనీసం తాగడానికి నీళ్లు, తినడానికి అన్నం కూడా పెట్టకుండా కఠినంగా వ్యవహరిస్తున్నాడు.సమయం దొరికినప్పుడల్లా దారుణంగా కొడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు.తనను ఇక్కడి నుండి పంపించమని కోరినా, యజమాని వినకుండా మరింత హింసిస్తున్నాడని ఆమె కంటతడి పెట్టింది.

ప్రస్తుతం ప్రాణభయంతో ఉన్న ఆ మహిళ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఆశ్రయించింది. “పవనన్నా.. మీరంటే మాకు ఎంతో నమ్మకం. నన్ను ఎలాగైనా ఈ నరకం నుండి రక్షించి స్వదేశానికి తీసుకురండి. నా ముగ్గురు బిడ్డలకు మీరే రక్షణ కల్పించాలి” అంటూ కన్నీళ్లతో వేడుకుంది. తనను కాపాడకపోతే ఇక్కడే చనిపోయేలా ఉన్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమ బిడ్డను క్షేమంగా తిరిగి రప్పించేలా ప్రభుత్వం చొరవ చూపాలని, విదేశీ వ్యవహారాల శాఖతో మాట్లాడి ఆమెను కాపాడాలని వేడుకుంటున్నారు. పవన్ కల్యాణ్ స్పందించి ఆమెకు పునర్జన్మ ప్రసాదిస్తారని ఆశిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -