చంద్రబాబు మాట వినకపోతే పోలీసులపైనా తప్పుడు కేసులు, అరెస్టులు పెడుతున్నారని మండిపడ్డారు మాజీ సీఎం జగన్. మీడియాతో మాట్లాడిన జగన్.. డీజీ స్థాయి అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్,అడిషనల్ డీజీ సంజయ్.. వీరంతా దళిత ఆఫీసర్లు.. బీసీ ఆఫీసర్ ఐజీ క్రాంతి రాణా టాటా,ఎస్సీ ఆఫీసర్ డీఐజీ విశాల్ గున్నీ ,వీరందరిపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెనక సీట్లలో కూర్చున్న రాముపై కేసా..?, హారిక జెడ్పీ చైర్మన్.. గవర్నమెంట్ డ్రైవర్ తోలుతున్న గవర్నమెంట్ కారులో వెనక సీటులో కూర్చున్నవారిపై కేసు ఎంతవరకు సమంజసం అన్నారు. ఒక బీసీ మహిళకు మీరు చేస్తున్న గౌరవం ఇదేనా..? మళ్లీ వీళ్లు బీసీల గురించి మాట్లాడుతారు.. సిగ్గుండాలని అని దుయ్యబట్టారు.
ఈనాడు.. టాయిలెట్ పేపర్‌కు ఎక్కువ.. టిష్యూ పేపర్‌కు తక్కువ అన్నారు. రైతులకు ధరల్లేక ఇబ్బందులు పడుతుంటే.. ఆనందంగా కేరింతలు కొడుతున్నారని రాస్తున్నాడు..అది పేపరా.. పేపర్‌కు పట్టిన పీడా అని మండిపడ్డారు. పరిస్థితి ఇలానే కొనసాగితే నేను చెప్పిన రేపు మా వాళ్లు వినే పరిస్థితి ఉండదు అన్నారు. దెబ్బ తగిలినోడికి ఆ బాధ తెలుస్తుంది..చంద్రబాబు ఇప్పటికైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సంప్రదాయాలను మానుకో అని హితవు పలికారు.
