Monday, May 20, 2024
- Advertisement -

త్వ‌ర‌లోనే ఆక్ర‌మాస్తుకేసుల‌నుండి నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌స్తాడా….?

- Advertisement -
YS Jagan CBI Case…IAS Srilakshmi case

జ‌గ‌న్ ఆక్ర‌మాస్తుల‌కేసులో సీబీఐకి దెబ్బ‌మీద దెబ్బ‌లు త‌గులున్నాయి. అన్యాయంగా జ‌గ‌న్‌ను కేసులో ఇరికించిన సీబీఐకి చుక్కుల క‌నిపిస్తున్నాయి. స‌రైన ఆధారాలు స‌మ‌ర్పించ‌క‌పోవ‌డంతో ఈకేసులో ఆరోప‌న‌లు ఎదుర్కొంటున్న ఐఎస్‌లు ఒక్కోక్క‌రిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.

ఇప్పుడు జ‌గ‌న్ కేసులో మ‌రో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. తాజాగా ఐఏఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమెపై సీబీఐ మోపిన అభియోగాలను హైకోర్టు కొట్టిపారేసింది. ఆమెపై ఐపీసీలోని 120బి (నేరపూరిత కుట్ర), 420 (మోసం), 409 (విశ్వాస ఘాతుకం) సెక్షన్ల కింద నమోదు చేసిన కేసును కొట్టివేసింది దీంతో సీబీఐకి ఎదురు దెబ్బ‌త‌గిలింది.

{loadmodule mod_custom,GA1}

రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో కడప జిల్లా మైలవరం మండలం పరిధిలో 408 హెక్టార్ల సున్నపురాయి గనులను రాష్ట్ర ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్‌కు లీజుకిచ్చింది. ఈ లీజు మంజూరులో అప్పట్లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది.ఆమెను 5వ నిందితురాలిగా చేర్చింది. దీనిపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే తనపై సీబీఐ అన్యాయంగా కేసులు నమోదు చేసిందని వాటిని కొట్టివేయాలంటూ శ్రీలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు.
ప్రభుత్వ ఉద్యోగి దుష్ర్పవర్తన కింద నమోదైన ఒక కేసును మాత్రం హైకోర్టు కొట్టివేయలేదు. అది మినహా మిగతా సెక్షన్ల కింది కేసుల్లో ఏవైనా అభియోగాలు నమోదు చేసి ఉంటే అవేవీ చెల్లవని ఉత్తర్వుల్లో హైకోర్టు స్పష్టం చేసింది. మొత్తం మీద కేసులో అత్యంత ఇబ్బంది ఎదుర్కొన్నది శ్రీలక్ష్మియే. జగన్‌ను ఇరికించేందుకు శ్రీలక్ష్మిని అప్పటి ప్రభుత్వాలు ఒక పావులా వాడుకున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి.ఈమ‌ధ్య‌నే శ్రీల‌క్ష్మిక తెలంగాణా ప్ర‌భుత్వం తిరిగి పోస్టింగ్ ఇచ్చింది.

{loadmodule mod_custom,GA2}

ఇక జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే జ‌గ‌న్ ఆక్ర‌మాస్తుల కేసులో అభియేగాలు ఎదుర్కొంటున్న ఐఎస్ అధికారులంతా ఒక్కొక్క‌రు నిర్దోషులుగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.ఇది జ‌గ‌న్‌కు పెద్ద ఊర‌ట‌. ఇప్ప‌టికే జ‌గ‌న్‌మీద మొత్తం 11 చార్జిషీట్ల‌ను సీబీఐ దాఖ‌లు చేసింది.వాటిలో 8 వాటికిస‌రైన ఆధారాలు లేవ‌ని సీబీఐనే కోర్టుకు చెప్ప‌డంతో వాటిని కోర్టు కొట్టిపారేసింది.ఇక మిగిలింది మూడు మాత్ర‌మే.వాటిలో అభియేగాలు రూ 44.5 కోట్లు.మిగిలిన వాటిని కూడా త్వ‌ర‌గా విచారించాల‌ని కోర్టుకు జ‌గ‌న్ లేఖ‌లు రాశారు. త్వ‌ర‌లోనే జ‌గ‌న్ నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌స్తార‌ని పార్టీ శ్రేణులు సంతోషంగా ఉన్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -