Friday, May 17, 2024
- Advertisement -

జ‌గ‌న్‌పై సీబీఐ కేసుల‌న్నీ డొల్లే అని టీడీపీ లో చర్చ.

- Advertisement -
Shocking comments on YS Jagan cases in TDP

సోనియా గాంధీని దిక్క‌రించార‌నే కార‌నంతోపాటు …. ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్‌కు ఉన్న పాపులారిటీని చూసి ఓర్వ‌లేని బాబు సీబీఐ కేసులు న‌మోదుచేసి ఎన్ని ఇబ్బందుల‌కు గురిచేశాడో రాష్ట్ర ప్ర‌జా నీకానికి త‌లిసిందే.

సీబీఐకి తోడు ఈడీ జ‌ప్తుల‌ని ఏకంగా 16 నెల‌లు జైల్లో పెట్టించిన ఘ‌నుడు చంద్ర‌బాబు. వీరికి తోడు ఉండ‌నే ఉందిగా ఎల్లోమీడియా దుస్ప్ర‌చారంచేసి … జ‌గ‌న్‌ను ఒక్క‌డిని చేసి కాంగ్రెస్,టీడీపీలు జ‌గ‌న్ రాజ‌కీయ జీవితాన్ని అంతంచేయ‌డానికి ఎన్ని ప‌న్నాగాలు,కుట్ర‌లు,కుతంత్రాలు ప‌డ్డారో అంద‌రికీ తెలిసిందే. జ‌గ‌న్ చూట్టూ ఏర్ప‌రిచిన ప‌ద్మ‌వ్యూహాన్ని చీల్చుకొని ప్రజాక్షేత్రంలో ప్ర‌జ‌ల‌కోసం నిల‌బ‌డ్డ నాయ‌కుడు జ‌గ‌న్‌.
రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 2014 జ‌రిగిన సాధార‌న ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు టీడీపీకీ ప‌ట్టం క‌ట్టారు. అదికూడా కొత్త రాష్ట్రం కావ‌డంతో అనుభ‌వ‌జ్ణులైన నాయ‌కుడు ఉండాల‌ని ఏపీ ప్ర‌జ‌లు భావించ‌డంతోపాటు..మోదీ అండ‌…ప‌వ‌ణ్ క‌ళ్యాన్ ప్ర‌చారం అన్నీ క‌ల‌సి వ‌చ్చి చావుత‌ప్పి క‌న్నులొట్ట‌పోయినంత చందాన కేవ‌లం 5 ల‌క్ష‌ల ఓట్ల మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చాడు.ప్ర‌జ‌ల ఇచ్చిన తీర్పు శిరోధార్య‌మ‌నుకొని ఒక వైపు డొల్ల‌కేసుల‌తో ఇబ్బందులు ప‌డుతున్నా మ‌రో వైపు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై రాజీలేని పోరాటం చేస్తున్నారు. గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా చంద్ర‌బాబు వ్య‌తిరే విధానాల‌ను ఎండ‌గ‌డుతూనే .. ప్ర‌త్యేక హోదాపై పోరాడుతూ ప్ర‌జ‌ల అభిమానాన్ని చూర‌గొంటున్నాడు.
జ‌గ‌న్‌కు రోజురోజుకీ ప్ర‌జ‌లల్లో పెరుగుతున్న ఆద‌ర‌న‌ను చూసి ఓర్వ‌లేక ఎల్లోమీడియా,టీడీపీ మ‌ళ్లీ కుతంత్రాల‌కు తెర‌లేపారు. జ‌గ‌న్‌పై ఉన్న కేసుల‌న్నీ మాపీ చేయించుకొనేదుకు బీజేపీలో పార్టీనీ విలీనం చేస్తున్నాడ‌ని కొద్దిరోజులుగా దుస్ప్ర‌చారానికి తెర‌లేపారు. ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ సీనియ‌ర్ నేత‌లు జ‌గ‌న్‌పై ఉన్న ఈడీ,సీబీఐ కేసుల‌న్నీ మాపీ అయిన‌ట్లేన‌ని ప్ర‌చారం మొద‌లు పెట్టారు.జ‌గ‌న్‌ని సీబీఐ కేసుల‌నుంచి త‌ప్పించేంద‌కు బీజేపీలోని ఒక వ‌ర్గం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని టీడీపీ నాయ‌కులు చెప్తున్నారు.ఏకంగా దీనికి లాజిక్‌కూడా వాల్లే చెప్తున్నారు. ఈడీ కేసుల్లో ఉన్న జ‌గ‌న్ ఆయా కంపెనీల పేరుతో పైన్ క‌డితే స‌రిపోతుందంటున్నారు.
అయితే టీడీపీ దుస్ప్ర‌చారం వెనుక మ‌రో కుట్ర కోణం ఉందంటున్నారు రాజ‌కీయ వ‌ర్గాలు. ప్ర‌త్యేక హోదా,రైల్వే జోన్‌, పోల‌వ‌రం ప్రాజెక్టు త‌దిత‌ర విష‌యాల్లో కేంద్రం మోసం చేసింద‌ని 2019 ఎన్నిక‌ల్లో బీజేపీనీ టార్గెట్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. బాబు జ‌రిపించుకున్న అంత‌ర్గ‌త స‌ర్వేల్లో కూడా బీజేపీతో క‌ల‌సి పోటీ చేయ‌డం కంటే సొంతంగా పోటీచేస్తే ఎక్కువ సీట్లు వ‌స్తాయ‌ని తేలింద‌ట‌.ప్ర‌త్యేక హోదా పాపం బీజేపీ మీద నెట్టేసి ఒంట‌రిని చేయాల‌ని బాబు ప్లాన్‌గా ఉన్న‌ ట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఓటుకు నోటు కేసులో త‌ప్పించు కొనేందుకు ప్ర‌త్యేక హోదా తాక‌ట్టుపెట్టిన బాబుపై మాట్లాడ‌కుండా ప‌వ‌ణ్ మాట్లాడ‌కుండా ఉత్త‌రాది.ద‌క్షిణాది అని మాట్లాడ‌టం దీనిలో భాగంగానే అంటున్నారు.
ప్ర‌త్యేక హోదాపై బీజేపీనీ టార్గెట్ చేసి జ‌గ‌న్ భాజాపాతో కుమ్మ‌క్క‌య్యార‌ని ప్ర‌ల‌కు చెప్పి అధికారంలోకి రావాల‌ని బాబు భావిస్తున్నార‌ట‌.కుట్ర‌లో భాగంగానే బాబు ఎల్లోమీడియా ద‌ర్వారా లీకులు ఇస్తూ జ‌గ‌న్‌పై ఉన్న కేసుల‌న్నీ క్లోజ్ అవ‌డం కాయ‌మ‌ని ప్ర‌చారం మొద‌లు పెట్టారు. ఇక ఇదే అంశాన్ని ప‌ట్టుకుని సీనియ‌ర్‌లు ప‌ట్టుకొని జ‌ట‌న్ పై దుస్ప్ర‌చారం చేస్తున్నారు. జ‌గ‌న్ ఎంత టార్గెట్ చేసినా ఉన్న కేసుల‌న్నీ కుట్ర‌పూరిత‌మైన కేసులేన‌ని అద ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ 130 సీట్ల‌నుంచి 150 సీట్ల వ‌ర‌కు గెలుచుకుంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. నంద్యాల ఉప ఎన్నిక టికెట్‌..ఉత్కంఠ‌కు తెర‌ప‌డేదెప్పుడు….?
  2. చంద్రబాబుకు, తెలుగు తమ్ముళ్ళకు చుక్కలు చూపిస్తున్న జగన్
  3. జగన్‌తో ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త భేటీ… 2019లో వైసీపీ విజయం ఖాయం..
  4. రైతు దీక్ష‌కు సిద్ధ‌మ‌వుతున్న జ‌గ‌న్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -