- Advertisement -

పులివెందులకు జగన్‌..వివరాలివే

- Advertisement -

రేపటి నుంచి మూడు రోజుల పాటు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ పులివెందులలో పర్యటించనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని క్యాంప్‌ ఆఫీస్‌లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్‌ నిర్వహిస్తారు, రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.

బుధవారం ఉదయం 9గంటలకు పులివెందుల వాసవి ఫంక్షన్‌ హాల్‌లో జరిగే వివాహానికి హాజరవుతారు, అక్కడి నుంచి బ్రహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలించి అక్కడే అరటి రైతులతో మాట్లాడతారు. అక్కడినుంచి పులివెందుల చేరుకుని లింగాల మాజీ సర్పంచ్‌ మహేష్‌ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం వేల్పులలో లింగాల రామలింగారెడ్డి నివాసానికి వెళతారు. అనంతరం అక్కడినుంచి పులివెందుల చేరుకుని క్యాంప్‌ ఆఫీస్‌లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు, రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఏపీలో అనంతపురంలో ప్రారంభించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి… కేంద్ర ప్రభుత్వ పథకమైన దీన్ని నేడు కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోంది అని మేరుగ నాగార్జున మండిపడ్డారు. దేశం మొత్తం మీద 22 లక్షల జాబ్ కార్డులు తీసేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 18 లక్షలు తీసేశారు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -