Wednesday, April 24, 2024
- Advertisement -

ఒక్క జ‌గ‌న్‌ను ఎదుర్కోవ‌డానికి రంగంలోకి జాతీయ నాయ‌కులు

- Advertisement -

చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోని క్లిష్ట‌ప‌రిస్థితులు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. త‌న 40 స‌వ‌త్స‌రాల రాజ‌కీయ అనుభ‌వం జ‌గ‌న్ ముందు స‌రిపోవ‌డంలేదు. ఓట‌మి త‌ప్ప‌ద‌ని తెలిసి ఎలాగైనా గెల‌వాల‌ని ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల‌న్నింటిని త‌న స్వార్థ‌రాజ‌కీయానికి వాడుకుంటున్నారు. అయినా కూడా బాబులో ఓట‌మి భ‌యం క‌న‌ప‌డుతోంది. ఇప్పుడు ఏకంగా జ‌గ‌న్‌ను ఓడించడానికి జాతీయ నాయ‌కుల‌ను రంగంలోకి దింపుతున్నారు చంద్ర‌బాబు.

అస‌లు విష‌యానికి వ‌స్తే….బాబు చెబుతుంటేనే ప్ర‌జ‌లు ఓట్లేయ‌డానికి సిద్దంగా లేరు. అలాంటిది ముక్కు, మొహం తెలియ‌ని నాయ‌కులు చెప్తే తెలుగు ప్ర‌జ‌లు ఓట్లేస్తారా…? ప్ర‌ముఖ‌ల‌ను ప్ర‌చారానికి పిల‌వ‌కుండా…త‌న కుల పెద్ద‌ల‌ను ప్ర‌చారానికి పిలిచిన‌ట్లుంది. కేవలం జాతీయ నేతల సామాజికవర్గాలున్న కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే బాబు తిప్పుతున్నారు.

టీడీపీ త‌రుపున ప్ర‌చారం చేయ‌డానికి ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ సిద్ద‌మ‌య్యారు. ఇప్పటికే జమ్మూకాశ్మీర్‌కు చెందిన నేషనల్ ఫ్రంట్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా ఏపీలో పర్యటించి టీడీపీ తరపున ప్రచారం చేశారు. మమతా బెనర్జీ పర్యటన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఏపీలో టీడీపీ తరపున ప్రచారానికి రానున్నారు. అలాగే డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, మాజీ ప్రధాని దేవగౌడ వంటి నేతలను కూడా ఏపీలో ఎన్నికల ప్రచారానికి రానున్నట్లు టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప‌రేక్ అబ్దుల్లా జ‌మ్మూ, కాశ్మీర్‌లో అవుట్ డెడ్ నేత‌. ఆయ‌న‌ను తీసుకొచ్చి ముస్లింలు ఎక్కువ‌గా ఉండే కడప, ఆళ్ళగడ్డలో ప్రచారం చేయించారు. ఫ‌రూక్‌తో పాటు ప్ర‌చారానికి వ‌స్తున్న నేత‌లంతా ఏపీతో ఎప్పుడూ ప్ర‌త్య‌క్ష సంబంధాలు లేవు. మమత బెనర్జీ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నేత. ఆమెతో విజయవాడ, విశాఖపట్నంలో ఓ మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయిస్తారట. టీడీపీ త‌రుపున ఒక్క‌రికి కూడా బ్రాహ్మ‌ణ సామాజికి వ‌ర్గానికి సీటుఇవ్వ‌లేదు. మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ్ తో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వక్కలిగలు ఎక్కువగా ఉన్న చోట్ల ప్రచారం చేయిస్తారంట బాబు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లేకపోతే లాలూప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ ను పిలిపించి నెల్లూరు లాంటి యాదవ సామాజిక వ‌ర్గం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్ర‌చారం చేయిస్తారంట‌. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో కూడా వైశ్యులు ఎక్కువగా ఉండే విజయవాడ, విశాఖపట్నంలోను, చెన్నైకి చెందిన స్టాలిన్ తో తమిళులు ఎక్కువగా ఉండే చిత్తూరులో ఎన్నిక‌ల ప్ర‌చారం చేయిస్తారంట‌. అయినా గాని ప్ర‌జ‌లు బాబుకు ఓటు వేయాలంటే వేస్తారు…అలాంటిది రాష్ట్రప్ర‌జ‌ల‌తో సంబంధంలేని నాయ‌కులు చెప్తే ఓట్లు వేస్తారా…..? ఇంత క‌న్నా బాబుకు అవ‌మానం ఏముంటుంది…? ఒక వేల టీడీపీ అధికారంలోకి రాక‌పోతె అప్పుడు ప‌రువు పోయోది ఎవ‌రిది….ప్ర‌చారానికి వ‌చ్చిన జాతీయ నాయ‌కుల‌ది కాదా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -