ఏపీ డేటా చోరీ , ఓట్ల తొలగింపు లాంటి సంఘటనలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. టీడీపీ , వైసీపీ ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. బాబు మీడియా అంటె జగన్‌కు, జగన్ మీడియా అంటె బాబుకు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది. తాజాగా సాక్షి మీడియాపై విరుచుకు పడ్డారు చంద్రబాబు. 2004లో కూడా ఓట్లను మీరే తొలగించారంటూ సాక్షి అడిగిన అడగడంతో పట్టలేని కోపంతో విలేకరిపై మండిపడ్డారు. నీ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకులేంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ప్రెస్ మీట్‌లో మీరు మాట్లాడేందుకు అర్హత లేదన్నారు. ఓ పార్టీ అధ్యక్షుడు పెట్టుకున్న పేపర్ … ఆయన మౌత్ పీస్ నువ్వు అంటూ విలేఖరిపై సీఎం చిర్రుబుర్రులాడారు. అవసరమైతే నా ప్రెస్ మీట్ లో మీ పత్రికను.. బాయకట్ కూడా చేస్తానన్నారు. మీకు వద్దనుకుంటే నా ప్రెస్ మీట్‌కు ఇకపై మిమ్మల్ని ఆహ్వానించామన్నారు చంద్రబాబు. పార్టీ ప్రకటన కూడా ఇవ్వమని తెగేసి చెప్పారు.
- Advertisement -
సాక్షి విలేకరిపై చిందులేసిన సీఎం చంద్రబాబు..
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
