Sunday, May 5, 2024
- Advertisement -

మాజీ సీబీఐ జేడీ అక్కడ నుంచే ఎంపీగా పోటీచేస్తాడా..?

- Advertisement -

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరతారు? పదవికి రాజీనామా చేసి ఆయన రాజకీయాల్లోకి వస్తున్న వార్తలు వచ్చింది మొదలు నడుస్తున్న చర్చ జోరుగా సాగుతోంది. వాలంటరీ రిటైర్మెంట్‌తో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఇప్పటికే ఒకసారి జనాల మధ్యకు వచ్చారు. రాజ‌కీయ ఎంట్రీపై త‌న మ‌నుసులోని మాట‌ల‌ను బ‌య‌ట పెట్టారు.

నిజాయితీ గల అధికారిగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరున్న లక్ష్మీనారాయణకు మంచి పేరుంది. యువ‌త ఫాలోయింగ్‌కూడా ఎక్కువే. త‌న ప్ర‌యానాన్ని రైతులతో సమావేశంతో మొద‌లు పెట్టారు. తనే వ్యవసాయ శాఖ మంత్రిని అయితే ఏం చేస్తానో చెప్పారు. ఒకేసారి తను మంత్రిని అయితే ఏం చేస్తానో చెప్పడం, రాజకీయాల పట్ల ఈయనకు ఉన్న ఉత్సాహానికి నిదర్శనంగా మారింది.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ విషయంలో ఇప్పటి వరకూ ఏ ప్రకటనా చేయకపోయినా, మంత్రినైతే, అని ఈయన అనడం.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని స్పష్టం అవుతోంది. గ‌తంలో టీడీపీ లేదా జ‌న‌సేన‌లోకి వెల్తార‌న్న వార్త‌లు సికార్లు చేశాయి. అయితే ఇప్పుడు తాజాగా మ‌రో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది.

అయితే ల‌క్ష్మీనార‌య‌ణ భాజాపాలోకి వెల్తున్నార‌ని…ఆయ‌న‌కు పార్టీ బంఫ‌ర్ అఫ‌ర్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ల‌క్ష్మీనారాయ‌ణ ఎంపీగా పోటీచేసే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న కర్నూలు లేదా గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి లక్ష్మినారాయణ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.

అయితే దీనిపై ఇంకా అధికారిక ధ్రువీకరణ ఏమీ లేదు. త్వరలోనే తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇస్తానని లక్ష్మినారాయణ ప్రకటించారు. తాను వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి అయితే ఎలాంటి ప‌నులు చేప‌డ‌తానోని చెప్ప‌డం చూస్తే ఖ‌శ్చితంగా ఏదో క పార్టీలో చేర‌డం మాత్రం ఖాయంగా క‌నిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -