Friday, May 17, 2024
- Advertisement -

వాటీజ్ దిస్ బొత్స ? మీరు మీ పార్టీ మారదా ?

- Advertisement -

పోలవరం పూర్తి చేయడానికి డెడ్ లైన్ ఎప్పుడు ?
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఏపీ పర్యటనలో చంద్రబాబు అవినీతి బట్టబయలు
ఎన్నికల్లో డబ్బు సంచులు మోసిన వారికే పోలవరం కాంట్రాక్టులు
పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే చిత్తశుద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా ?
కమీషన్ల కోసమే చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.
వైఎస్ఆర్ హయాంలో ఘనంగా శంకుస్థాపన చేశాం
రూ 5వేల కోట్లు ఖర్చు చేసి నాడు కాల్వలు పూర్తి చేశాం.
నాడు అన్ని అనుమతులూ సాధించేశాం. తర్వాత వచ్చిన పాలకులు పట్టించుకోలేదు.
గడ్కరీ ప్రశ్నలతో చంద్రబాబుకు ముచ్చెమటలు.
సమాధానం చెప్పలేక నీళ్లు నమఉలుతూ, బేలచూపులు చూసిన బాబు.
పోలవరంలో అవినీతి జరిగిందని.. చంద్రబాబు వ్యవహార శైలి, నడవడిక, భాషను బట్టి స్పష్టంగా అర్థం అవుతోంది.
29 సార్లు ఢిల్లీ వెళ్లిన బాబు ఏం చేశారు ? అవినీతి లెక్కలు చూసుకోవటానికే వెళ్లారా ?

ఏంటివన్నీ అనుకుంటున్నారా ? ఈ ప్రశ్నలు, విమర్శలు వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత శ్రీశ్రీశ్రీ బొత్స సత్యనారాయణ గారు శోధించి, సంధించిన అస్త్రాలు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పోలవరంలో పర్యటించారు. తర్వాత చంద్రబాబుతో కలసి మీడియాతో మాట్లాడారు. పోలవరానికి కేంద్రం కట్టుబడి ఉందని, పూర్తి చేస్తుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కూడా ఎప్పటిలాగానే తానూ చెప్పాల్సింది చెప్పేశారు.

అంతవరకూ ఓకే కానీ. తర్వాత ఆ ప్రెస్ మీట్ మీద బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టేశారు. పైన రాసుకొచ్చిన ప్రశ్నలు, విమర్శలు గుప్పించేశారు. ఆపసోపాలు పడిపోతూ అరగంట సేపు ప్రెస్ మీట్ లో బొత్సాగారు కొత్తగా చెప్పుకొచ్చిన మాట ఒక్కటంటే ఒక్కటీ లేదు. పాడిందే పాడరా పాచిపళ్ల దాసరా..? అన్నట్టు ఎన్నాళ్లీ ఊకదంపుడు విమర్శలు, ఆరోపణలు. కేంద్రానికి, చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్ట్ మీద చిత్తశుద్ధి లేదు. సరే మీ పార్టీకి ఉంది కదా ? మరి మీరేం చేస్తున్నారు. నాడు వైఎస్ అది చేశారు. ఇది చేశారు అని చెప్పుకోవడం తప్ప మీరు చేసింది ఏమిటి ? మీ చిత్తశుద్ధి ఎంత ? అధికార పార్టీ పట్టించుకోవడం లేదు సరే. ప్రతిపక్షంగా మీరు వెళ్లి పోలవరం ప్రాజెక్టు వద్ద నిరాహార దీక్షలు చేయవచ్చు కదా ? అక్కడే టెంటు వేసుకుని తాడో పేడో తేల్చుకోవచ్చు కదా ? పోలవరంపై ప్రధాని స్పష్టమైన హామీ ఇచ్చి, నిధులు మంజూరు చేసేవరకూ నిరాహారదీక్ష చేపట్టి చరిత్రలో నిలిచిపోవచ్చు కదా ? పోనీ గడ్కరీ వస్తున్నారని వారం పది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆయనను అడ్డుకునే ప్రయత్నమైనా చేశారా ? ఇక్కడ తేల్చాకే మీరు విమానం ఎక్కాలని నిలదీశారా ? అలా చేస్తే మోడీ గారు మీ భరతం పడతారాని భయమా ? బీజేపీ, టీడీపీ చిత్తశుద్ధిపై ప్రశ్నించే ముందు మీ చిత్తశుద్ధిని గురించి ప్రజలు ప్రశ్నించకుండా చూసుకోండి సార్. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలా ప్రెస్ మీట్లు పెట్టి పసలేని ఆరోపణలు, విమర్శలు చేస్తే మీకే నష్టం. వీళ్లు ఎంతసేపూ చంద్రబాబు మీద పడి ఏడుస్తారే తప్ప, ప్రతిపక్షంగా ఒక్కడైనా గట్టిగా, చిత్తశుద్ధితో పోరాడారా ? అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తే ప్రమాదముంది.

అంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఉన్నారు కదా…ఏం అంతా జాతీయస్థాయి మీడియాను వెంటబెట్టుకుని వెళ్లి పోలవరం పూర్తయితేనే ఎన్నికలైనా ? ఇంకేమైనా ? అని నిరాహారదీక్ష చేపట్టవచ్చు కదా ? హైదరాబాద్ ఎటూ మాకు కాకుండా చేశారు. పోలవరం మాత్రం మా జీవన్మరణ సమస్య, ఇది తేల్చాల్సిందే అని ఖరాకండిగా చెప్పి ధర్నాలతో దద్దరిల్లేలా చేస్తే కేంద్రం దిగిరాదా ? కేవలం జల్లికట్టు ఆట కోసం తమిళనాడు రణరంగమైపోతే కేంద్రం దిగిరాలేదా ? మరి మన బతుకు మెతుకు అయిన పోలవరం కోసం మీరు అలా ఫైట్ చేయలేరా ? అలా చేస్తే జనం జేజేలు కొడతారు. ఓట్లు వేస్తారు. అందలం ఎక్కిస్తారు. అంతేకాని ఇలా పూటకో నాయకుడు ప్రెస్ మీట్లు పెట్టి, సోది చెప్పినట్లు పదే పదే టీడీపీ మీద విమర్శలు చేస్తే…మీరు చెప్పింది నూటికి నారుశాతం నిజమైనా జనం నమ్మరు. వీళ్లింతే రా బాబూ అని టీవీలు మార్చేస్తారు. ఇకనైనా వారి చిత్తశుద్ధిని ప్రశ్నించేముందు మీ చిత్తశుద్ధి ఎంతో ప్రశ్నించుకోండి. జల్లికట్టు తరహాలో పోరాటం చేయండి. చరిత్రలో నిలిచిపోండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -