Sunday, May 5, 2024
- Advertisement -

చంద్రబాబు అవినీతికి తెరపడ్డట్లేనా.. జగన్ కీలక నిర్ణయం..!!

- Advertisement -

చంద్రబాబు అక్రమాలు, అవినీతి ని బయటకు తీస్తూ కూర్చుంటే ఓ మనిషి జన్మ చాలదు అన్న సంగతి తెలిసిందే.. నలభై ఎల్లా రాజకీయ జీవితంలో అయన న్యాయం కంటే అన్యాయాలు, నీతి కంటే అవినీతి ని ఎక్కువ గా ప్రోత్సహించి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారు.. ఆయన చేతి ఎందరో సామాన్యులు అణగదొక్కబడ్డారు అన్న సంగతి తెలిసిందే.. పక్కనే ఉంది వెన్నుపోటు పొడిచే చంద్రబాబు తన కుటిల రాజకీయ తంత్రం తో ఎదురు మనిషి ని ఎలా లోబరుచుకోవాలో లోబరుచుకుని వాడుకుని ఆ తర్వాత వారి ని తన స్టయిల్ లో మోసం చేస్తారు.. ఇక ఈ పద్ధతి కేవలం మానవుల వరకే కాదు ఆ జగన్నాధుడు పై కూడా.. చంద్రబాబు కు మానవుడైన, దేవుడైనా ఒకటే.. తన  కాదేదీ అవినీతికనర్హం అన్నట్లు చంద్రబాబు అవినీతికి హద్దులేదు..

తాజాగా టీటీడీ ఆర్థిక వ్యవహారంలో కూడా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.. చంద్రబాబు హయాంలో టీటీడీ ని చంద్రబాబు వాడుకుని ఆర్థికంగా లాభపడ్డారు అని వార్తలు గతంలో రాగ అవి ఇప్పుడు చంద్రబాబు మెడకు చుట్టుకోబోతున్నాయి. శవాలతో రాజకీయాలు చేసే చంద్రబాబు టీటీడీపీ తో కుల రాజకీయాలు చేసే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే టీటీడీపీ ఆర్థిక వ్యవహారం గురించి మాట్లాడితే అప్పుడు తన టీడీపీ కార్యకర్తలతో కులం అనే మంట ను రాజేసి ఈ కేసుకు కులాన్ని అంటగట్టి తప్పించుకునే ప్రయత్నం చేశేవారు. ఇక చంద్రబాబు హయాంలో టీటీడీ ఆర్థిక పరిస్థితులపై కాగ్ తో ఆడిట్ చేయించాలని కోరుతూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి హై కోర్టు ను ఆశ్రయించగా చంద్రభాను దాటవేసే ప్రయత్నం చేయడం అనుమానాలకు దారి తీసింది. కానీ జగన్ మాత్రం ఈ అవినీతి విషయంలో ఎంతో పకడ్బందీగా చంద్రబాబు ను ఉచ్చులోకి దించడానికి రంగం సిద్ధం చేశారని తెలుస్తుంది.

2014-19 వరకూ టీటీడీ ఆదాయ, వ్యయాలను ఆడిట్ చేయించాలని నిర్ణయించారు. అంతటితో సరిపెట్టుకుండా గత రెండేళ్లుగా కూడా మొత్తం ఆర్థిక వ్యవహారాలను కాగ్ తో ఆడిట్ చేయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా ఆగష్ట్ 28 నాటి టీటీడీ బోర్డ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఈ వ్యవహారం పూర్తి చేసే అవకాశం ఉంది. ఆడిటింగ్ పూర్తయిన తర్వాత ఆ వివరాలను హైకోర్ట్ కి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీనితో పార్టీలకతీతంగా అందరు జగన్ నిర్ణయాన్ని ప్రశంశిస్తున్నారు. జగన్ తో పాటుగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే పలువురు నేతలు అవినీతి కేసులో జైలు కూడు తింటున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా త్వరలో జైలు కూడు తింటాడేమో అని టీడీపీ కార్యకర్తలు భయపడిపోతున్నారు.. మనిషి అయితే ఏం చేయలేకపోవచ్చు. దేవుడు కూడా ఏమీ చేయలేకపోయాడనుకున్నాడేమో చంద్రబాబు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -