- Advertisement -

ప్రత్యక్ష ఎన్నికల్లో లోకేష్ పోటీ…… బాబు భయాన్ని చూసి షాక్ తిన్న టిడిపి నేతలు

- Advertisement -

దొడ్డిదారిన ప్రధాని అయ్యాడు అని వందల సార్లు మన్మోహన్‌సింగ్‌ని ఎగతాళి చేసిన చంద్రబాబు……..అదే దొడ్డిదారిన లోకేష్‌ని మంత్రిని చేసేశాడు. అయితే ఇప్పుడు 2019 ఎన్నికల్లో మాత్రం లోకేష్‌ని ప్రత్యక్ష ఎన్నికల్లో దింపాలని చంద్రబాబు కోటరీ ఆలోచిస్తోంది. లోకేష్ కూడా ఉత్సాహం చూపిస్తున్నాడు. కానీ చంద్రబాబుకు మాత్రం ఓ పట్టాన నమ్మకం కుదరడం లేదు. అందుకే తన అనుయాయులైన నాయకుల చేత లోకేష్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే కచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అన్న విషయంపై సర్వేలు చేయిస్తున్నాడు. ఈ సర్వేలలో బాబు ప్రధాన భజనపరుడు అయిన ఒక తోక మీడియా అధినేత కూడా పాల్పంచుకుంటున్నాడు. హిందూపురం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందా అని సర్వే చేశారు. అయితే హిందూపురం నుంచి ఈ సారి బాలయ్య గెలవడం కూడా కష్టమే అని తేలడంతో ఆ నియోజకవర్గాన్ని పక్కనపెట్టేశారు.

కుప్పం వదలడానికి చంద్రబాబు ఇష్టపడడం లేదు. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాలు చూద్దామంటే రాజధాని నిర్మాణం ఎఫెక్ట్‌తో భూములు కోల్పోయినవాళ్ళు ఎంత ఆగ్రహంగా ఉన్నారో స్పష్టంగా తెలియని పరిస్థితుల నేపథ్యంలో రిస్క్ అనుకున్నారు. ఫైనల్‌గా చంద్రబాబు సొంత ఊరు చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని ఆలోచించి అక్కడ సర్వే చేశారు. ఆ సర్వేలో పాజిటివ్ ఫలితం రావడంతో ఆ విషయాన్ని చంద్రబాబుకు చెప్పారు. అయితే మొత్తం విశ్లేషణను శ్రద్ధగా విన్న చంద్రబాబు ఆ తర్వాత మాత్రం చంద్రగిరి నుంచి లోకేష్ పోటీ చేయాలన్న విషయంపై అంతెత్తున అరిచాడట.

చంద్రగిరిలో వైఎస్‌లకు పులివెందులలో ఏ స్థాయిలో బలం ఉంటుందో ఆ స్థాయిలో బలం ఉండేలా తీర్చిదిద్దొచ్చని అభిప్రాయపడ్డ తన కోటరీపై మండిపడ్డాడట చంద్రబాబు. స్వయంగా తాను పోటీ చేస్తేనే ఘోరంగా ఓడించిన ప్రజలు తన కొడుకును ఎందుకు ఆదరిస్తారని ఎదురు ప్రశ్నిస్తాడట. పులివెందులలో వైఎస్‌లు, సిద్ధిపేటలో హరీష్‌రావులకు ఉన్న స్థాయిలో ప్రజల్లో గ్రిప్ తెచ్చుకోవడం అంత ఆషామాషీ విషయం కాదని….జరిగే పనికూడా కాదని విశ్లేషించాడట చంద్రబాబు. 2019 ఎన్నికల్లో కచ్చితంగా గెలిచే నియోజకవర్గం చూడండి……….అంతకుమించి ఎక్కువ ఆలోచించొద్దు, ఆశలు పెట్టుకోవద్దు అని తన కోటరీకి ఆదేశాలు జారీ చేశాడట. ఇప్పుడు ఇదే విషయాన్ని తోక మీడియాలో పనిచేస్తున్న ఒక జర్నలిస్ట్ సాటి మీడియా మిత్రులతో షేర్ చేసుకోవడం చర్చనీయాంశం అయింది. మొత్తానికి వైఎస్‌ల స్థాయిలో ప్రజాదరణ, ప్రజాభిమానం పొందడం తమ వళ్ళ అయ్యే పనికాదని నారా వారికి పూర్తి స్పష్టత ఉందన్న విషయం తెలుసుకున్న ప్రత్యర్థి జర్నలిస్టులు కూడా చంద్రబాబుకు ఎన్నికల రాజకీయాలపై పూర్తి స్పష్టత ఉందన్న విషయాన్ని ఒప్పుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -