చంద్రబాబు నాయుడు నంద్యాల పర్యటనలో శిల్పా చక్రపాణి రెడ్డి కనిపించలేదు. మొన్నటి వరకూ చంద్రబాబు నాయుడు శిల్పా చక్రపాణి రెడ్డికి చాలా ప్రాధాన్యతను ఇచ్చాడు.మండలి ఛైర్మెన్ పదవిని ఇస్తానని చెప్పారు.కాని ఇప్పుడు చేదుగా మారారు.
మోహన్ రెడ్డి పార్టీని వీడటంతోనే బాబు చక్రపాణికి ప్రాధాన్యతను ఇవ్వడం ఆపేశాడని స్పష్టం అవుతోంది. ఇదే సమయంలో స్థానిక లీడర్లు కూడా చక్రపాణి రెడ్డిని దూరంపెట్టడం మొదలుపెట్టారు. ప్రత్యేకించి భూమా అఖిలప్రియ దొరికిందే సందుగా.. చక్రపాణి రెడ్డిని పట్టించుకోవడం మానేసింది. అసలు అఖిల ఎవ్వరినీ పట్టించుకోవడం లేదని.. పార్టీ తరపున పనిచేస్తున్న వారిలో కూడా కొందరిని కలుపుకుపోవడానికి ఇష్టపడటం లేదని స్పష్దం అవుతోంది.
ఆదినారాయణరెడ్డి, అమరనాథ్ రెడ్డి వంటి నాన్ లోకల్ లీడర్లను నమ్మినట్టుగా.. లోకల్ లీడర్లను ఆమె నమ్మడంలేదు. వారితో కలిసి ప్రచారానికి కూడా వెళ్లడ లేదు. ఆమె శిల్పా చక్రపాణి రెడ్డిని పట్టించుకోకపోవడంలో పెద్ద ఆశ్చర్యంలేదుటిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపుకు వేస్తున్న ప్రణాళికలన్నీ చక్రపాణి వైసీపీలోని తన సోదరునికి చేరవేస్తారనే అనుమానం నేతల్లో ఉన్నట్లుంది. అందుకనే ఎన్నిక విషయం కావచ్చు ఇతరత్రా సమావేశాలు కావచ్చు ఎందులోనూ చక్రపాణికి ఆహ్వనం అందటం లేదు..
చంద్రబాబు తాజా పర్యటనకు ఆహ్వానం అందకపోవటం. దాంతో చేసేది లేక ఎంఎల్సీ కూడా కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు.తెలుగుదేశం పార్టీని వీడాలని చక్రపాణికిలేకపోయినా.. టీడీపీ వాళ్లే ఆయనను బలవంతంగా వెళ్లగొట్టేలా ఉన్నారని మాత్రం స్పష్టం అవుతోంది.త్వరలోనె అన్నబాటలోనె తమ్ముడుకూడా పయనించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
