Monday, May 6, 2024
- Advertisement -

50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఘోరంగా ఓడిపోతారుః బాబుకు వివరించిన ఇంటెలిజెన్స్

- Advertisement -

2019 ఎన్నికల్లో ఎలా అయినా అధికారంలోకి రావాలని వ్యూహం రచిస్తున్న చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్. అధికారంలో ఉన్నంత కాలం ఎప్పటికప్పుడు టిడిపి ఎమ్మెల్యేలపై ప్రజల స్పందనను ఇంటెలిజెన్స్ సర్వేలతో తెలుసుకుంటూ ఉండడం చంద్రబాబు నైజం. ఇప్పుడు కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌తో అలాంటి సర్వే చేయించాడు చంద్రబాబు. ఆ సర్వేలో షాకింగ్ విషయాలు తెలిశాయి. దాదాపు 50 మంది టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఘోర ఓటమి తప్పదని ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ తేల్చి చెప్పింది. ఆయా స్థానాల్లో టిడిపి ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర స్థాయి వ్యతిరేకత ఉందని ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ తేల్చి చెప్పింది.

ఇంతకు ముందు ఇదే ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ఫిరాయంపు ఎమ్మెల్యేల విషయంలో కూడా ఇలాంటి నివేదికే ఇచ్చింది. వైకాపా నుంచి టిడిపిలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరూ కూడా 2019 ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేస్తే గెలిచే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. ఇప్పుడు టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు 50 మందిపై ప్రజా వ్యతిరేకత ఉందని ఇంటెలిజెన్స్ సర్వే తేల్చిచెప్పడంతో బాబు ఆలోచనలో పడిపోయారు. అందుకే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాడు చంద్రబాబు. కాంగ్రస్‌కి సంస్థాగతంగా 5శాతం ఓటింగ్ ఉందని బాబు నమ్ముతున్నాడు. ఆంధ్రప్రదేశ్ నాట గెలుపు ఓటములను నిర్ణయించేది ఆ ఐదు శాతం ఓట్లే అనడంలో సందేహం లేదు. 2014 ఎన్నికల్లో అయితే అటూ ఇటూగా ఒక్క శాతం ఓట్ల తేడాతోనే అధికారంలోకి వచ్చాడు బాబు. అందుకే కాంగ్రెస్‌తో జట్టుకడితే ఆ ఐదు శాతం ఓట్లు కలిసొస్తే 2019లో కూడా అధికారం దక్కుతుందన్నది బాబు ఆలోచన. అయితే ప్రజల్లో విభజన నాటి కోపం ఇంకా ఉండి ఉంటే మాత్రం కాంగ్రెస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న పాపానికి టిడిపిని కూడా అడ్డంగా తొక్కేస్తారేమోనన్న భయం కూడా చంద్రబాబుకు ఉంది. ఏది ఏమైనా ఇప్పటికే వచ్చిన సర్వే ఫలితాలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే మాత్రం ఏదైనా అద్భుతం జరిగితే తప్ప 2019 ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడం అయితే ఖాయంగా కనిపిస్తోందన్న అభిప్రాయం మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -