Wednesday, May 15, 2024
- Advertisement -

40 యియ‌ర్స్ ఇండ‌స్ట్రీ మాట‌ల‌తో గంద‌ర గోళంలో టీడీపీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు

- Advertisement -

చంద్ర‌బాబు నాయుడుకు మ‌తిమ‌రుపు వ్యాధి (అల్జీమ‌ర్స్) తో బాధ‌ప‌డుతున్నాడ‌ని మూడోసారి ముఖ్య‌మంత్రి గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి గుస గుస‌లు వినిపిస్తున్నాయి. ఏ ప్రొగ్రామ్ కు వెళ్తే ఆ ప్రొగ్రామ్ కు సంబంధించిన విష‌యాలు…ల‌క్ష్యాలు చెప్ప‌డం స‌హ‌జం…అయితే చంద్ర‌బాబు టెలికాన్ఫ‌రెన్స్ మొద‌లు… స‌మీక్ష‌లు…బ‌హిరంగ సభ‌ల్లో సంబంధం లేని అంశాలు ప్ర‌స్తావిస్తూ త‌న మ‌తిమ‌రుపు విష‌యాన్ని దాచే ప్ర‌య‌త్నం చేస్తుంటార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

గ‌తంలో తెలంగాణ‌లో జ‌న‌సేన ఎందుకు పోటీ చేయ‌డం లేద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ప్ర‌శ్నించిన చంద్ర‌బాబు … ఇప్పుడు ప్ర‌జాకూట‌మి గెలుపుకు జ‌న‌సేన కార్యక‌ర్త‌లు సైనికుల్లా పోరాడాల‌ని పిలుపు ఇవ్వ‌డం అల్జీమ‌ర్స్ ప్ర‌భావ‌మేనని రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

దేశ రాజ‌కీయాల్లో 40ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఉన్న ఏకైక నాయ‌కుడు తానేని సెల్ప్ డ‌బ్బా కొట్టుకోవ‌డంలో చంద్ర‌బాబు నాయుడు మించిన నేత‌లేడు అనేది అంద‌రికీ తెలిసిందే. త‌ను నిత్యం వ‌ల్లివేసే సినిమా స్టోరీనే చంద్ర‌బాబు నాయుడుకు ప్ర‌తిబంధ‌కంగా మారుతున్న‌ది. సాధార‌ణంగా మ‌నుషుల్లో 40ఏళ్ళు దాటిన త‌రువాత అల్టీమ‌ర్స్ ప్ర‌భావం ప్రారంభ‌మౌతుంది. వ‌య‌స్సు పెరిగే కొద్ది దాని ప్ర‌భావం పెరుగుతూ వ‌స్తూ రావ‌డం సాధార‌ణం. అయితే 64ఏళ్ళ న‌వ యువ‌కుడు మా చంద్ర‌బాబు అని భ‌జ‌న చేసే త‌న వ‌ర్గం మీడియా….కొంద‌రు ప‌సుపు నేత‌లు నిత్యం వల్లించే పొగ‌డ్త.

మ‌రి చంద్ర‌బాబు నాయుడు నిజంగా నిత్య య‌వ్వ‌న‌ప‌రుడేనా….వ‌య‌స్సు శ‌రీరానికే గాని మ‌న‌స్సుకు కాద‌ని అప్పుడ‌ప్పుడు సెల‌విచ్చే చంద్ర‌బాబు మీద వ‌య‌స్సు ప్ర‌భావంతో పాటు…రాజ‌కీయ ఒత్తిడితో మ‌తిమ‌రుపు వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడ‌నేది రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. నిత్యం జ‌రిగే వివిధ స‌మీక్ష‌ల్లో ఆయా శాఖ‌ల‌కు సంబంధించిన విష‌యంపై సంబంధం లేకుండా స్పీచ్ చంద్ర‌బాబు స్టార్ట్ చేస్తుంటార‌ని స‌చివాలయంలో అధికార‌వ‌ర్గాలు అంత‌ర్గ‌త సంబాష‌ణ‌ల్లో సెటయిర్స్ వేస్తుంటార‌ని స‌మాచారం.

ఏదైనా శాఖ‌కు సంబంధించి స‌మ‌స్య‌లను అధికారులు చంద్ర‌బాబు ముందు ఉంచితే దానికి సంబంధించి ఎలా అధిగ‌మించాల‌ని అనే విష‌యాన్ని వ‌దిలేని స‌మ‌స్య‌లు ఎదురైన‌ప్పుడు స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొని నిలిస్తేనే గెలుపు సాధ్య‌మ‌ని…నా రాజ‌కీయ జీవితంలో ఎన్నో సంక్షోభాల‌ను…స‌వాళ్ళ‌ను ఎదుగ‌ద‌ల‌కు అవ‌కాశంగా మార్చుకున్న‌ట్లు చెబుతుండ‌టాన్ని బాబు మ‌తిమ‌రుపు వ్యాధిగ్ర‌స్తుడ‌ని చెప్ప‌డానికి అధికారులు నిదర్శంగా చెప్పుకుంటుంటారు.

చంద్ర‌బాబు మ‌తిమ‌రుపుతో అధికారుల‌కు స‌మీక్ష‌ల్లో సుదుర్ఘీ స్పీచ్ ల బాధ ఎదుర‌వుతుంటే నాయ‌కులకు…కార్య‌క‌ర్త‌ల‌కు మాత్రం మ‌రొక స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. ప్ర‌తి మీటింగ్ లో ఎదో ఒక ల‌క్ష్యంతో నిర్వ‌హింస్తుండ‌టం అనవాయితీ అయితే ఆ మీటింగ్ కు సంబంధించి ముందే సిద్ధం చేసిన పాయింట్స్ ను చ‌దివేశాక త‌లాతోక లేకుండా చంద్ర‌బాబు మాట్లాడ‌టం స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. దీంతో చంద్ర దండు కార్య‌క‌ర్త‌లు చంద్ర‌బాబు నాయుడు త‌న స్పీచ్ లో లైన్ త‌ప్పిన‌ప్పుడెల్లా చప్ప‌ట్ల హోరెత్తించిన వెంట‌నే వాళ్ళ‌ని కంట్రోల్ చేసే పేరుతో చంద్ర‌బాబు త‌న స్పీచ్ నుంచి డైవ‌ర్ట్ అయ్యేలా దేశం నేత‌లు తిప్ప‌లుప‌డుతుండ‌టం బ‌హిరంగ ర‌హ‌స్యం.

అస‌లు విష‌యంకు వ‌స్తే ఖ‌మ్మం ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ జ‌న‌స‌మితికి జ‌న‌సేన‌కు తేడా తెలియ‌కుండా మాట్లాడ‌టం అల్జీమ‌ర్స్ ప్ర‌భావ‌మ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. కూటిమి విజ‌యానికి ఎన్నిక‌ల బరిలో లేని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పోరాడాల‌ని ఒక‌టికి రెండు సార్లు పిలుపునివ్వ‌డం ఆయ‌న మ‌తిమ‌రుపుకు సాక్ష్యం. పొర‌బాటున దొర్లింద‌ని పార్టీ వ‌ర్గాలు చెప్పుకోవ‌చ్చుగాని విన్న జ‌నం మాత్రం ముక్కున వేలేసుకున్నారు. మ‌రి చంద్ర‌బాబుకు అల్జీమ‌ర్స్ వ్యాధి ఉందా…లేదా అనేది విజ్జలైన పాఠ‌కులే నిర్ణ‌యించాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -