Sunday, May 19, 2024
- Advertisement -

తెలంగాణ అమరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్…

- Advertisement -

60 ఏళ్లపాటు వివక్షకు గురైన జనం.. తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం అయిన రోజు.. వెన్నుచూపని ధైర్యంతో, మొక్కవోని సంకల్పంతో పోరాడి 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకున్న రోజు.. ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇవాల్టితో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు పూర్తయ్యాయి.

గత ఏడేళ్లుగా ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తూ.. దేశానికే తలమానికంగా నిలిచింది. అభివృద్ధి పథంలో తెలంగాణ ముందుకెళుతోంది. ఉద్యమ నేత కేసీఆర్.. సీఎంగా రెండోసారి పదవీ చేపట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమయ్యారు. నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం ప్రగతిభవన్‌లో జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నారు.

కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స వ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. గన్ పార్క్ వద్ద సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంచలన నిర్ణయం తీసుకున్న నటి శ్రియా..!

బండ్ల గణేష్ ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్..

70 పులుల హంతకుడు ‘టైగ‌ర్ హ‌బీబ్’ అరెస్టు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -