Saturday, April 27, 2024
- Advertisement -

70 పులుల హంతకుడు ‘టైగ‌ర్ హ‌బీబ్’ అరెస్టు!

- Advertisement -

సాధారణంగా పులి అంటే ఎంతగా భయపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గత కొంత కాలంగా తెలంగాణలో పులులు చేస్తున్న హల్చల్ అంతా ఇంతా కాదు.. దాన్ని పట్టుకోవడానికి ఫారెస్ట్ అధికారుల నానా తంటాలు పడుతున్నారు. అలాంటింది ఏకంగా 70 పులులను సునాయాసంగా చంపి వాటి పాలిట యమకింకరుడిగా గుర్తింపు పొందిన హబీబ్ తాలూక్దార్ ని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గత 20 ఏళ్లుగా సుంద‌ర్బ‌న్ అడ‌వుల్లో అత‌ను బెంగాల్ టైగ‌ర్స్‌ను చంపేసేవాడు.

వృత్తి రిత్యా తేనె స్వీకరించి అమ్ముకును హబీబ్ పులులను చంపి వాటి గోర్లు, చర్మం, ఇతర విలువైన అవయవాలను విక్రయించడంతో అడ్డుగోలు డబ్బు సంపాదించాడు. పశ్చిమ బెంగాల్ ను ఆనుకుని ఉండే సుందర్బన్ అడవుల్లో తిరిగే పులులే అతడి లక్ష్యం. అతడిని టైగర్ హబీబ్ అని పిలుస్తారు. అట‌వీశాక అధికారులు 20 ఏళ్ల నుంచి ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తన కోసం పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలిగానే అడవిలోకి వెళ్లి రహస్యంగా దాక్కునేవాడు.. కీకారణ్యంలోకి వెళ్లలేక పోలీసులు వెనుతిరిగేవారు.

అయితే సుంద‌ర్బ‌న్ స‌మీపంలో ఉన్న మాధ్యా సోనాటోలా గ్రామంలో హబీబ్ ఉన్నట్టు పక్కా సమాచారంతో పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు. సుమారు 70 పులుల‌ను చంపిన‌ట్లు హ‌బీబ్ అంగీక‌రించాడ‌ని షారంకోలా రేంజ్ ఫారెస్ట్ ఆఫీస‌ర్ జోయ‌ల్ అబెదిన్ తెలిపారు. అంతే కాదు అతనిపై అనేక కేసులు ఉన్నాయని.. పులుల హ‌త్య వెనుక భయంకరమైన గ్యాంగ్‌లు కూడా ఉన్న‌ట్లు ఆఫీస‌ర్ జోయ‌ల్ చెప్పారు.

ఆన్ లైన్ ద్వారా ఆనందయ్య మందు పంపిణీ!

ఆనాడు కష్టపడి తండ్రిని కాపాడుకుంది.. కానీ ఇప్పుడు!

ఆంధ్రప్రదేశ్ కు మేఘా ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకులు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -