Friday, May 3, 2024
- Advertisement -

జగన్‌కి కలిసిరానున్న సమీకరణాలు

- Advertisement -

‘నిప్పులా బ్రతికా అని అస్తమానం చెప్పుకుతిరిగే చంద్రబాబు చేసిన తప్పులు అన్నీ ఇన్నీ కావు. కాస్త న్యూట్రల్‌గా ఉండే ఏ సీనియర్ జర్నలిస్ట్‌తో……లేకపోతే అప్పట్లో రాజకీయాలపై కాస్త అవగాహన ఉన్న ఏ న్యూట్రల్ వ్యక్తిని కదిలించినా బాబు తప్పులను విడమరిచి చెప్తారు. అయితే ఆ తప్పులన్నింటినీ మరుగుపరుస్తూ చంద్రబాబు గొప్ప నాయకుడు, పాలకుడు అంటూ డబ్బా కొట్టుడు ప్రచారం చేయించుకోవడంలో మాత్రం బాబుది అందెవేసిన చెయ్యి. ఇప్పుడున్న వైకాపా నాయకులెవ్వరూ కూడా చంద్రబాబు తప్పుల గురించి, చంద్రబాబు చేతకానితనం గురించి పూర్తిగా జనాల్లోకి వెళ్ళేలా మాట్లాడలేకపోతున్నారు. కేవలం జగన్‌పైనే ఆధారపడి 2019లో అధికారంలోకి వచ్చేస్తామని ఆశపడుతున్నారు.

అయితే ఇప్పుడు ప్రచారం విషయంలో వైకాపాకు అత్యంత బలం అయ్యే తెలుగు హీరో జగన్ సమక్షంలో వైకాపాలో చేరనున్నాడు. ఆయనే మంచు మోహన్ బాబు. చంద్రబాబు యువకుడిగా ఉన్నప్పటి నుంచీ ఎన్టీఆర్‌కి అల్లుడవ్వడం…….ఆ తర్వాత వెన్నుపోటు పొడవడం వరకూ బాబు లోగుట్టు వ్యవహారాలన్నీ స్పష్టంగా తెలిసిన వ్యక్తి మోహన్‌బాబు. మోహన్‌బాబును స్వర్గీయ ఎన్టీఆర్ సొంత తమ్ముడిలా చేరదీశారు. ఆయన ఇంటిమనిషిగా ఎన్టీఆర్‌తో కలిసున్న వ్యక్తి కాబట్టి చంద్రబాబు వ్యవహారాలన్నీ మోహన్‌బాబుకు తెలుసు. అన్నింటికీ మించి మోహన్ బాబు వాయిస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ వాయిస్ వైకాపాకు బలమవ్వబోతోంది. గతంలో రాజ్యసభ సభ్యుడిగా చేసిన మోహన్ బాబు……ఇప్పుడు మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వైకాపా తరపున పోటీచేయాలని కోరుకుంటున్నాడు.

జగన్ ఎస్ అనడమే తరువాయి……..ఆ వెంటనే వైకాపా కండువా కప్పుకోనున్నాడు మోహన్ బాబు. చంద్రబాబు సొంత జిల్లా వ్యక్తి, సొంత కులం వ్యక్తి అయిన మోహన్ బాబు వైకాపాలో చేరితే కుల సమీకరణాల విషయంలో కూడా వైకాపాకు ఎడ్జ్ ఉంటుందనడంలో సందేహం లేదు. మోహన్ బాబు వాగ్ధాటిని ఎదుర్కునే స్థాయి నాయకుడు టిడిపిలో లేడు. జగన్‌ని ఒక్కడిని చేసి చంద్రబాబు, లోకేష్‌తో పాటు ఇతర మంత్రులందరూ కూడా రెచ్చిపోయి మరీ విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ ఈ డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఏ స్థాయిలో కౌంటర్స్ ఇస్తాడో…….వైకాపా శ్రేణులకు ఏ స్థాయిలో ఉత్సాహాన్ని ఇస్తాడో చూడాలి మరి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -