టీడీపీలో రేవంత్ రెడ్డి ప్రస్థానం ముగిసినట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్ ఖండువా కప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నారనె చెప్పుకోవాలి. కొన్ని రోజులుగా రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనె వార్తలు తెలంగాణా రాజకీయాల్లో హల్ చల్ చేశాయి. పార్టీ మారుతున్నారనె వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డిని వివరణ కోరగా ఇప్పటి వరకు స్పందించకపోవడంతో ఆయనకు ఉన్న అధికారాలను చంద్రబాబు ఖట్ చేసిన సంగతి తెలిసిందె.
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ మారతారని అనుమానాలు వ్యక్తమవుతోన్న వేళ టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అందరితో చేతులు కలుపుతూ అసెంబ్లీ లోనికి వెళ్లిపోయారు.
టీడీపీ ఆఫీసుకు వెళ్లినా.. ఆ కుర్చీలో కూర్చోలేదు. అసెంబ్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఆ సమయంలో జరుగుతున్న బీఏసీ సమావేశానికి కూడా హాజరు కాలేదు. అలాగే టీడీఎల్పీ ఆఫీసుకు వెళ్లిన రేవంత్.. ఇంతకుముందు ఆయనకు కేటాయించిన కూర్చిలో కాకుండా మరో సీట్లో కూర్చోవడం గమనార్హం.
పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి దాదాపు టీడీపీకి దూరమైనట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన నుంచి హైదరాబాద్ వచ్చాక.. ఆయనను కలిసి తాజా పరిణామాలను రేవంత్ వివరించనున్నట్లు తెలిసింది. తనకు పార్టీలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబుకు చెప్పిన తర్వాతే.. కాంగ్రెస్ పార్టీలో చేరతారని రేవంత్ వర్గం నేతలు చెబుతున్నారు.
