Thursday, March 28, 2024
- Advertisement -

అమ్మకు ఎంపీ..? కొడుక్కు ఎమ్మెల్యే…?

- Advertisement -

ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేల రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. అన్ని పార్టీలు అభ్య‌ర్తుల ఎంపిక‌లో త‌ల‌మున‌క‌లై ఉన్నారు.ఇక టికెట్ రాని వాళ్లు మాత్రం వేరే పార్టీల వైపు చూస్తున్నారు. త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తుకోసం ముందుగానే త‌మ దారి తాము చూసుకుంటున్నారు. తాజాగా భాజాపాకు చెందిన కీల‌క మ‌హిళా నేత ప్యాన్ గూటికి చేరేందుకు రెడీ అయ్యారంట‌.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్పుడు దేశ రాజ‌కీయాల్లో త‌నదైన ముద్ర వేసిన కేంద్ర‌మాజీ మంత్రి పురందేశ్వ‌రి వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా రాష్ట్రంలో భ‌జాపా ప‌రిస్థితి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌త్యేక‌హోదా, రైల్వేజోన్‌, క‌డ‌ప స్టీల్ ప‌రిశ్ర‌మ‌తో పాటు విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలో పూర్తిగా విఫ‌లం అయ్యింద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో భాజాపాలో ఉంటే రాజ‌కీయంగా భ‌విష్య‌త్తు ఉండ‌ద‌నే ఈనిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. సంక్రాంతి త‌ర్వాత వైసీపీ కండువా క‌ప్పుకుంటార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

చిన్న‌మ్మ ఫ్యామిలీ వైసీపీలో చేరుతార‌నే ప్ర‌చారంతో ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాలు వేడెక్కాయి. పురందేశ్వ‌రి ఎంపీగా పోటీ చేస్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. గుంటూరు లేదా న‌ర్స‌రావు పేట స్థానం నుంచి పోటీ చేస్తాన‌నే ప్ర‌చారం జ‌రుగుతున్నా జ‌గ‌న్‌నుంచి మాత్రం హామీ రాలేదంట‌. ఇక కుమారుడు హితేశ్ రాజకీయ అరంగేట్రం కూడా 2019 ఎన్నికల్లో జరగబోతుంది. కుమారుడికి పర్చూరు అసెంబ్లీ నుంచి బరిలోకి దించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. వైసీపీలో చేరుతారా లేదా అన్న‌ది సంక్రాంతి త‌ర్వాత స్ప‌ష్ట‌త రానుంది. లేకుంటే చిన్న‌మ్మ ఫ్యామిలీ నుంచన్న క్లారిటీ రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -