- Advertisement -

లోకేష్‌కు జగన్ స్వీట్ వార్నింగ్!

- Advertisement -

14 నెలల కింద విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇలాంటి ప్రమాదంలోనే పెంటయ్య అనే కార్మికుడు చనిపోయారు..అప్పట్లో పరిహారంతో పాటు పెంటయ్య పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకూ పరిహారం, ఉద్యోగాలు ఇవ్వలేదు అని మండిపడ్డారు మాజీ సీఎం జగన్. బాధిత కుటుంబంపై ఇంత నిర్దయగా ప్రభుత్వం వ్యవహరించడం ధర్మమేనా? అనిప్రశ్నించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాద బాధితులను గాజువాక కిమ్స్‌ ఆసుపత్రిలో పరామర్శించిన అనంతరం మాట్లాడిన జగన్.. చంద్రబాబు ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం, బాధిత కుటుంబాలకు ఉద్యోగం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2024లో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు ఎలా ఉన్నారు? ..కూటమి ప్రభుత్వం వచ్చాక గత రెండేళ్లుగా ప్లాంట్‌లో కార్మికుల పరిస్థితి ఏంటి?..ప్రతి ఒక్కరూ ఆలోచించుకుని.. బేరీజు వేసుకోవాలి అన్నారు.

బాధితులకు కూటమి ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం, బాధిత కుటుంబాలకు ఉద్యోగం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఆ పని చేయకుంటే.. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పరిహారం అందిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజాస్వామ్యం పరిహాసంగా మారిందని, బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి లోకేష్‌ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఇంకెంతకాలం పాలన సాగిస్తారని ప్రశ్నించిన జగన్.. తాము అధికారంలోకి వచ్చాక బదులు తీర్చుకుంటామని తెలిపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించడానికి వచ్చిన తనను అడ్డుకోవడానికి పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించడాన్ని జగన్ తప్పుపట్టారు. ఆసుపత్రి వద్ద వందలాది మంది పోలీసులను మోహరించి, వైఎస్సార్‌సీపీ నాయకులను లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని అన్నారు.
స్టీల్ ప్లాంట్‌లో ఇంత పెద్ద ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే, ప్రభుత్వం కనీసం స్పందించిన తీరు దారుణంగా ఉందని.. బాధితులకు అండగా నిలవాల్సిన అధికార యంత్రాంగం, విపక్ష నేత పర్యటనను అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వ హయాంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను తాము చూస్తూ ఊరుకోబోమని జగన్ హెచ్చరించారు. అక్రమ కేసులు పెడుతున్న అధికారుల వివరాలను తాము కూడా సేకరిస్తున్నామని, భవిష్యత్తులో వీరందరికీ చట్టపరంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -