Saturday, May 4, 2024
- Advertisement -

కేంద్రం నుంచి ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై సంకేతాలు….

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రానికి స‌మ‌యం ఆస‌న్న‌మ‌య్యిందా…? గుజ‌రాత్‌, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో భాజాపా విజ‌యం సాధించ‌డంతో మోదీ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కే మొగ్గుచూపుతున్నారా…? అవున‌నే సంకేతాలు కేంద్రంనుంచి ప‌క్కా స‌మాచారం. దీంతో ఏపీలో ఎన్నిక‌ల సంమ‌రం ఊపందుకోనుంది.

2019 ఎన్నిక‌ల్లో అధికారం కోసం వైసీపీ,అధికార‌పార్టీ టీడీపీ ప్ర‌తీష్టాత్మకంగా తీసుకున్నాయి. ముంద‌స్తు ఎన్నిక స‌మాచారం అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు అందాయి. అందుకే జ‌గ‌న్ ముందుగా పాద‌యాత్రను ప్రారంభించారు. ముంద‌స్తు స‌మాచారంతో పాద‌యాత్ర‌లో అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల‌కు ఏంచేస్తామో వివ‌రిస్తున్నారు. జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌ను టీడీపీ అమ‌లు చేస్తేఆ క్రెడిట్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంది.

పాద‌యాత్ర వ‌చ్చే ఏడాది ఏప్రిల్ వ‌ర‌కు జ‌రిగే అవ‌కాశం ఉండ‌నుంది. ఈలోపు పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌లు ఏంకోరుకుంటున్నారు, ఇంకా ఎలాంటి ప‌థ‌కాలు అమ‌లు చేయాల‌నే దానిపై మ‌రింత స్ప‌ష్ట‌త వ‌స్తే మ్యానిఫెస్టోలో చేర్చ‌డానికి వీల‌వుతుంది. అదే విధంగా నియోజ‌క వ‌ర్గాల్లో ఎవ‌రికి బ‌లం ఉందో వారిని ఐడెంటిఫై చేయ‌డానికి జ‌గ‌న్‌కు మంచి అవ‌కాశం.

2018 లో ఛ‌త్తీష్‌ఘ‌డ్‌, క‌ర్నాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మేఘాల‌యం, మిజోరాం, రాజ‌స్థాన్, త్రిపుర రాష్ట్రాల ఎన్నిక‌లు ఉన్నాయి. 2019లో రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నిక‌లు ఉన్నాయి. వాట‌న్నింటిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ముంద‌స్తు ఎన్నిక‌లకు స‌మాయాత్త మ‌వుతోంద‌నే స‌మాచారం. పాద‌యాత్ర ముగిసేలోపు పొత్తుల‌పై ఒక స్ప‌ష్ట‌త వ‌స్తుంది.

ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్ట‌బోయో బ‌డ్జెట్ ఖ‌శ్చితంగా ఎల‌క్స‌న్‌ల‌ను దృష్టిలో ఉంచుకొనే రూపొందిస్తుంది. కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై కేంద్రంనుంచి ఒక స్ప‌ష్ట‌త వ‌స్తూంది కాబ‌ట్టి స‌మీక‌ర‌నాలు మారుతాయి. బ‌డ్జెట్ స‌మావేశాలు మిగియ‌గానే అధికార‌పార్టీ నుంచి జంపింగ్‌లు మొద‌ల‌వుతాయ‌ని అధికార‌పార్టీనేత‌లు అంటున్నారు. అదేవిధంగా టికెట్ల కేటాయింపుకూడా జ‌రిగిపోతాది కాబ‌ట్టి అసంతృప్తులు వైసీపీగాని, జ‌న‌సేన‌లోకి గాని వెల్లే అవ‌కాశాలు మెండుగా ఉంటాయి.

ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల వ్య‌తిరేక‌త‌, అసంతృప్తినేత‌లు, పొత్తుల‌హామీల విష‌యంలో అధికార‌పార్టీ స‌మాయాత్తం అయ్యేలోగా వైసీపీని ఎన్నిక‌లు పూర్తి స‌న్న‌ద్ధం చేయ‌ట‌మే జ‌గ‌న్ ముందున్న ల‌క్ష్యం. గ‌తంలో జ‌రిగిన త‌ప్పులు మ‌రో సారి జ‌ర‌గ‌కుండా జ‌గ‌న్ జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. కేంద్రంనుంచి ముంద‌స్తుఎన్నిక‌ల స‌మాచారం, రాష్ట్రంలో పార్టీల‌లో వ‌స్తున్న స‌మీక‌ర‌నాలు చూస్తుంటే ముంద‌స్తు ఎన్నిక‌లు ఖాయం అన్న సంకేతాలు వ‌స్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -