Tuesday, May 14, 2024
- Advertisement -

అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మిస్తే తప్ప జగన్‌ని ఓడించలేరా?

- Advertisement -

అబద్ధాలు……..అబద్ధాలు…….అబద్ధాలు……..ప్రతి రోజు……ప్రతి క్షణం…..అవే అబద్ధాలు. కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలను కూడా అబద్ధాలతో కప్పి పుచ్చాలన్న ప్రయత్నం……ఆ అబద్ధాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విసుగొస్తోంది……..వెగటు పుడుతోంది. తెలంగాణాలో పార్టీకి దిక్కూ దివాణం లేకుండా పోతుంది అని తెలిసినప్పటికీ జగన్ మాత్రం సమైక్యాంధ్ర అన్నాడు. సమైక్యాంధ్ర కోసం నిరాహారదీక్ష చేశాడు. సమైక్యాంధ్ర అన్నప్పటికీ తెలంగాణా రాష్ట్రంలో ఒక ఎంపి సీటు, ఎమ్మెల్యే సీట్లను గెల్చుకున్నాడు. చంద్రబాబుతో పాటు రామోజీరావు, రాధాకృష్ణలు మాత్రం పూర్తిగా తెలంగాణాకు సహకరించారు. కానీ సీమాంధ్ర కోసం పాటు పడుతున్నట్టుగా జనాలను అబద్ధపు ప్రచారంతో నమ్మించారు. సమైక్యాంధ్ర కోసం ఫైట్ చేసిన జగన్‌నేమో విభజనకు సహకరించిన ద్రోహి అని సీమాంధ్ర ప్రజల్లో అనుమానపు బీజాలు నాటుకునేలా అబద్ధాలతో నమ్మించారు. అదెలా అంటే జగన్‌కి బెయిల్ వచ్చింది కదా…..ఆ బెయిల్ సోనియానే ఇప్పించింది……కుమ్మక్కయినందుకే ఇప్పించింది అన్నారు. ఆ మాట నిజమే అనుకుందాం. మరి అంతుకుముందు కేసులు పెట్టించింది కూడా సోనియానే……..జగన్ ఏ తప్పూ చేయలేదు అని చెప్తారా అంటే అలా చెప్పరు. ఎప్పటికెయ్యది అప్పటి అబద్ధాలతో కథ నడిపిస్తూ ఉంటారు. ఓటుకు కోట్లు కేసులో పబ్లిక్‌గా దొరికిపోయిన చంద్రబాబు……తనను తాను నిప్పు అని చెప్పుకోవడం…..ఆయనకసలు అవినీతి అంటే ఏంటో తెలియదు అన్నట్టుగా అబద్ధపు రాతలతో ప్రజలను నమ్మించాలని చూసినవాళ్ళకు ఇవి ఒక లెక్కా.

ఇక ఇప్పుడు కూడా సేం టు సేం అదే సీన్. జగన్ కేసుల్లో కొట్టివేతలు, మినహాయింపులు వస్తున్నాయి కాబట్టి మోడీతో కుమ్మక్కయ్యాడు అంటున్నారు. మరి నిన్నటి వరకూ కేసులన్నీ బలంగా ఉండడానికి కారణం ఏంటి? అదే మోడీతో కుమ్మక్కయిన చంద్రబాబు కేసుల్లో జగన్‌కి మినహాయింపులు రాకుండా చేశాడా? మొదటి వార్త నిజం అయితే రెండో వార్త కూడా నిజమే కావాలిగా. కానీ అలా ఒప్పుకోరు.

ప్రశాంత్ కిషోర్ అమిత్ షా మీటింగ్‌కి హాజరయ్యాడని ఆంధ్రజ్యోతి, ఈనాడుతో సహా పచ్చ మీడియా సంస్థలన్నీ ఊదరగొట్టాయి. చంద్రబాబు కూడా ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడేశాడు. కట్ చేస్తే అసలు ఆ రోజు ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలోనే లేడు అన్న నిజం బయటికి వచ్చింది. జాతీయ మీడియా సంస్థలన్నీ పచ్చ బ్యాచ్ అబద్ధపు ప్రచారాన్ని ఉతికి ఆరేశాయి.

ఇక్కడే అర్థం కావడం లేదా? పచ్చ బ్యాచ్ అబద్ధాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో మోడీ ఇప్పుడు అతి పెద్ద విలన్. అందులో సందేహం లేదు. అందుకే నాలుగేళ్ళుగా అంటకాగిన చంద్రబాబు, 2014లో మోడీకి ఓట్లేయించిన చంద్రబాబు, పవన్, పచ్చ మీడియా సంస్థలన్నీ కూడా ఇప్పుడు మోడీని తెలివిగా వదిలేస్తూ ఉన్నాయి. ఆ పాపం తమకు అంటకుండా జాగ్రత్తపడుతున్నాయి. కానీ అదే మోడీతో జగన్ కుమ్మక్కయ్యాడు అని చెప్పి ఆ పాపాన్ని జగన్‌కి అంటగట్టాలన్న ప్రయత్నమే జుగప్స కలిగిస్తోంది.

2014లో విభజనకు పూర్తిగా సహకరించిన బిజెపికి, మోడీకి ఓట్లు వేయించింది ఎవరు? మోడీ అన్నీ చేస్తాడు అని సీమాంధ్రప్రజల నెత్తిన మోడీని రుద్దింది ఎవరు? ఆ పాప భారం మొత్తం ఎవరు మోయాలి? ప్రజాగ్రహం మొత్తం ఇప్పుడు ఎవరిపైకి వెళ్ళాలి అంటే కచ్చితంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పచ్చ మీడియా సంస్థలే దోషులుగా కనిపిస్తాయి. కానీ ఆ దోషులు మాత్రం చాలా తెలివిగా వాళ్ళు పునీతులయినట్టుగా…….జగన్ దోషి అయినట్టుగా అబద్ధాలతో చిత్రించే ప్రయత్నాలు చేస్తున్నారు. అబద్ధాలు చెప్తే తప్ప జగన్‌ ప్రజా బలాన్ని ఓడించలేమని ఘంటాపథంగా ఒప్పుకుంటున్నారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలే. మరోసారి అసత్యానికే అధికారం అప్పగిస్తారో……..లేక జగన్‌కి అండగా నిలబడతారో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -