తెలంగాణాలో అన్ని పార్టీలు అభ్యర్తుల ఎంపిక, ఎన్నికల ప్రచారంతో దూసుకు పోతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఎమ్, టీజేఎస్‌లు కలసి మహాకూటమిని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్తల ఎంపిక కూడా ఓ కొలిక్కి వస్తోంది. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టిన పవన్ ఇప్పటి వరకు తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. గతంలో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్ అబిమానులు ఒత్తిడి పెంచడంతో కనీసం ఆస్యంగానైనా పవన్ మేల్కొన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలా…ఒకవేళ పోటీ చేస్తే ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి.. వంటి అంశాలపై మేధోమధనం ప్రారంభించిందట.జనసేన తెలంగాణ నాయకులు పవన్ కల్యాణ్ పై ఆ ఒత్తిడి పెడుతున్నారు. తెలంగాణలో పోటీ చేసే విషయంపై ఆయన మాత్రం ఇప్పటి వరకు ఏ విషయమూ చెప్పలేదు.
తెలంగాణలో కనీసం 40 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టాలని తెలంగాణ నాయకులు తమ నేత పవన్ కల్యాణ్ ను కోరుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని జనసేన ముఖ్య నేతలతో ఈ నెల 16న పవన్ భేటీ కాబోతున్నారట. ఆ భేటీ అనంతరం తెలంగాణ ఎన్నికల్లో పోటీపై స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా…తమ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడానికి కనీసం ఒకటి రెండు నెలల ముందే పోటీ చేసే అంశంపై ఓ క్లారిటీతో ఉంటుంది. కాని జనసేన మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యింది. కాని జనసేన మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేది వారం రోజుల్లో తేలిపోనుంది.
