Sunday, May 5, 2024
- Advertisement -

గుంటూరు యూత్ ‘ లావు ‘ కే జై..!

- Advertisement -

గుంటూరు జిల్లాలో రాజ‌కీయాలు ర‌సవ‌త్త‌రంగా మారుతున్నాయి. ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం గుంటూరులో మ‌రింత‌గా ఈ స‌మీక రణ‌లు, మార్పులు క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుత ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకొని పోవ‌డం లేద‌ని, ముఖ్యంగా యువ‌త‌ను అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని స్థానిక యువ‌త పెద్ద ఎత్తున గ‌గ్గోలు పెడుతోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో 2014 లో ఇక్క‌డి యువ‌త‌కు పెద్ద ఎత్తున ఉపాధి చూపిస్తాన‌ని టీడీపీ అభ్య‌ర్థిగా అప్ప‌ట్లో గ‌ల్లా జ‌య‌దేవ్ ప్ర‌క‌టించారు. అయితే, ఆయ‌న అధికారంలోకి వ‌చ్చి(ఎంపీగా ప‌ద‌విని స్వీక‌రించి) దాదాపు నాలుగున్న‌రేళ్లు పూర్త‌య్యాయి. మ‌రి ఈ నాలుగున్న‌రే ళ్ల‌లో ఇక్క‌డి యువ‌త‌కు గ‌ల్లా సాధించి పెట్టింది ఏమైనా ఉందా? అంటే ప్ర‌శ్న‌లు త‌ప్ప స‌మాధానం ల‌భించ‌డం లేదు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌య‌దేవ్ ఇంటికో ఉద్యోగంతో పాటు ఇక్క‌డ ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుపై పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకుని ఎన్నిక‌ల్లో ల‌బ్ధిపొందారు. అయితే ఈ హామీల్లో ఒక్క‌టి కూడా నెర‌వేర‌లేద‌న్న‌ది ప‌క్క‌న పెడితే ఆయ‌న ఈ నాలుగేళ్ల‌లో నియోజ‌క‌వ‌ర్గానికి అందుబాటులోనే లేరు. రాజ‌ధాని ప్రాంత‌మైన గుంటూరులో ఒక్క నూత‌న ప‌రిశ్ర‌మ కూడా రాలేదు. పైగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో జాబ్ మేళాలైనా జ‌రిగాయి. అక్క‌డి యువ‌త‌కు ప్రోత్సాహ‌క‌రంగా ఉపాధి అయినా ల‌భించింది. కానీ, గ‌ల్లా మాత్రం ఈ దిశ‌గా కూడా ఒక్క అడుగూ వేయ‌లేదు. ఫ‌లితంగా ఎక్క‌డి స‌మ‌స్య అక్క‌డే అన్న చందంగా మారిపోయింది. దీంతో నిరుద్యోగుల ను కానీ, గుంటూరులోని యువ‌త‌ను కానీ, ప‌ట్టించుకున్న నాధుడే క‌నిపించ‌ని ప‌రిస్థితి.

గుంటూరుకు చ‌దువుల న‌గ‌రంగా పేరుంది. వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చే విద్యార్థులు ఇక్క‌డ చ‌దువుకుని ఉద్యోగాల్లో స్థిర‌ప‌డేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తా రు. అయితే, ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ వారికి అందిస్తున్న సౌక‌ర్యాలు కానీ, ఎంపీగా నిరుద్యోగుల‌కు అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాల‌క‌ల్ప‌న‌కు కానీ.. గ‌ల్లా న‌డుం బిగించింది లేదు. పైగా.. త‌న వ్యాపారాల‌ను పెంచుకోవ‌డంలోను, బ్రాంచుల‌ను అభివృద్ధి చేసుకోవ‌డంలోనూ ఎంపీ గ‌ల్లాచాలా బిజీగా మారి పోయార‌న్న అభిప్రాయం ఆయ‌న‌పై ఓపెన్‌గానే ఉంది.

ఇక‌, వైసీపీ త‌ర‌ఫున ఇక్క‌డ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేయాల‌ని భావిస్తున్న లావు శ్రీకృష్ణ దేవ‌రా యులు.. యువ‌త స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టారు. తాను కూడా యూత్ కావ‌డంతో యువ‌త ఇక్క‌డ అనుభ‌విస్తున్న క‌ష్టాల‌కు చెక్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే క్ర‌మం త‌ప్ప‌కుండా త‌మ‌ విజ్ఞాన్ సంస్థ‌ల్లోనే జాబ్ మేళాలు నిర్వ‌హిస్తున్నారు. వివిధ ప్ర‌ఖ్యాత సంస్థ‌ల‌ను గుంటూరుకు ఆహ్వానించారు. యువ‌త‌కు పెద్ద ఎత్తున అవ‌కాశం క‌ల్పించాల‌నే ల‌క్ష్యం తో ముందుకు సాగారు. ఇక స్థానికంగానే అందుబాటులో ఉండ‌డంతో చాలా మంది పార్టీల‌కు అతీతంగా ఆయ‌న వైపు చూస్తున్నారు. ఇక ఇప్ప‌టికే గుంటూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న వివిధ స‌మ‌స్య‌ల‌ను నియోజ‌క‌వ‌ర్గాల వారీగా గుర్తించి… వాటి ప‌రిష్కారానికి ఓ మాస్ట‌ర్ ప్లాన్‌తో లావు ఉన్నారు. తాను ఇంకా ప్ర‌జాప్ర‌తినిధి కాక‌పోయినా.. రాబోయే రోజుల్లో త‌న ప్ర‌స్తానం ప్ర‌జ‌ల‌తోనే అని నిర్ణ యించుకున్న లావు.. ప్ర‌తి అడుగునూ ప్ర‌జాభ్యున్న‌తి దిశ‌గా వేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -