2014 ఎన్నికల్లో టీడీపీ,భాజాపాకు మద్దతిచ్చిన పవన్ కళ్యాన్ ఆ తర్వాత తన మద్దతును ఉపసంహరించుకున్నారు. బాబు సంగతి తెలియక అప్పట్లో మద్దతిచ్చానని చెప్పిన పవన్ ఓ రేంజ్‌లో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. సందు దొరికినప్పుడల్లా లోకేస్, బాబును ఏకిపారేస్తున్నారు.
వచ్చేసార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ కశ్చితంగా అధికారంలోకి వస్తానని ధీమాగా చెబుతున్నారు. కర్నాటకలోలాగానే ఏపీలో కూడా సీన్ రిపీట్ అవుతాదని పవన్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు.2019లో జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని రాష్ట్రంలో ఎందరు నమ్ముతున్నారు? రాష్ట్రంలో అలాంటి వారు పదిశాతం మంది కూడా లేరంటే అతిశయోక్తి కాదు. అందులో ఉండేది మెగా కుటుంబం అభిమానులే.
అయితే ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేయలేకపోయినా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు పుస్కలంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి సమయంలో పవన్ ఎవరికి మద్దతిస్తారనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్య్రం దినోత్సవం రోజున పవన్ చేసిన వ్యాఖ్యలను బట్టిచూస్తే వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికే జైకొడతారనే విధంగా.. మాటలు సంకేతాలిస్తున్నాయి
లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు నిదర్శనం.ఎన్టీఆర్ 60 ఏళ్లు దాటాక రాజకీయాల్లోకి వచ్చారు. కేటీఆర్ పోరాడిన, ప్రజల్లోంచి గెలిచిన అనుభవం ఉంది.. మరి లోకేష్ కు సీఎం కావడానికి ఏం అర్హత ఉంది? అని ప్రశ్నించారు. ఇక్కడ కేటీఆర్ ను మాత్రం సీఎం పదవికి పూర్తి అర్హుడిగా పవన్ పరిగణిస్తుండడం విశేషం.
లోకేష్ కు అర్హత లేదు అన్నదొక్కటే పవన్ ఆవేదనగా కనిపిస్తోంది. ఆ రకంగా పోరాటపటిమ, ప్రజల్లోంచి గెలిచి రాజకీయాల్లోకి రావడం అనే విషయాల్లో జగన్ కు కూడా తిరుగులేని మార్కులు పడతాయి. దీన్ని బట్టి చూస్తే పవన్ జగన్‌కే మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
