Monday, April 29, 2024
- Advertisement -

తిరుపతి టిటిడి లో ప్రక్షాళన మొదలుపెట్టిన జగన్

- Advertisement -

టీటీడీ విషయంలో జగన్ దృష్టి సారించారు.. ఇటీవలే స్వామివారి బ్రహ్మోత్సవాలకు జగన్ హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి విమర్శకుల నోళ్లు మూయించారు.. గత కొద్ది కాలంగా దేవాలయాల పై జరుగుతున్న దాడులపై జగన్ అశ్రద్ధ ఎంతో ఉందని ప్రతిపక్షాలు తెగ ప్రచారం జరిపాయి.. అంతర్వేది వంటి కీలక ఘటన లో జగన్ జాప్యం హిందువుల మనోభవాలను దెబ్బతీసేలా ఉన్నాయని ప్రతిపక్ష నేతలు కుల రాజకీయం చేసి జగన్ ఇమేజ్ ని దెబ్బ తీయడానికి ప్రయత్నించారు.. కానీ ఏదైనా తనదైన శైలిలో స్పందించి సమస్య పరిష్కారం చేసే జగన్ ఈ విషయంలో సరైన సమయంలో స్పందించి ప్రజల నమ్మకాన్ని మరొకసారి నిలబెట్టుకున్నారు..

సమస్య పరిష్కారమైనా ప్రజల మనసులో ఉన్న ఎంతో కొంత అనుమానాన్ని తిరుమల కి వచ్చి అది కూడా లేకుండా చేసుకున్నారుజగన్.. దీని తర్వాత ప్రజలు జగన్ ను చూసే దృష్టి మారిపోయిందని చెప్పాలి.. ఆగమ సంప్రదాయాలను పాటించిన ఆయన తీరుని అంతా అభినందించారు. తాజాగా చినజీయర్ స్వామి కూడా జగన్ వైఖరిని సమర్థించారు. జగన్ ఏ పని చేసినా నిండు హృదయంతో చేస్తారని అభినందించారు. ఆయన తిరుమల దర్శనం వల్ల హిందూ మతానికి ఎనలేని మేలు జరుగుతుందని జీయర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక టీటీడీ లో ప్రక్షాళన మొదలుపెట్టారని ఇటీవలే టీటీడీ లో జరిగిన మార్పును చూస్తే అర్థమవుతుంది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ని బదిలీ చేశారు. ఆయనకు ఏపీ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి హోదాలో అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న జవహార్ రెడ్డికి త్వరలోనే టీటీడీ ఈవో పదవి కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది.టీటీడీలో ఉత్తరాది కి చెందిన ఐఏఎస్ అధికారి స్థానంలో రాష్ట్రానికి చెందిన వారిని నియమించడం ద్వారా యాత్రికులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -