జనసేన అధినేత పవన్, టీడీపీ మంత్రి లోకేష్‌లు ఇద్దరూ ఇద్దరే. బహిరంగ సభల్లో ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడంలేదు. మాట్లాడే టప్పుడు కనీస రాజకీయ పరిజ్ణానం లేకుండా చేస్తున్న వ్యాఖ్యల వల్ల ప్రజల్లో వీరు నవ్వుల పాలవుతున్నారు. అసలు వీల్లు మాట్లాడే మాటలకు, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులకు ఏమాత్రం సారుప్యతలేదు.
అసలు విషయానికి వస్తే .. పవన్ పోరట యాత్రలో భాగంగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. సభల్లో పవన్ చేస్తున్న కామెంట్స్ జనాలకు నవ్వుతెప్పించే విధంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మరియు కాంగ్రెస్ కలిసి పోటీ చేయబోతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అస్సలు ఈ రెండు పార్టీ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. దానికి తోడు కాంగ్రెస్‌కూడా కలుస్తాయనడంలో ఎవరికీ అర్ధం కాలేదు. ఇందులో మర్మమేమిటో పవన్ గారికే తెలియాలి. పవన్ ఎప్పుడూ అంటుంటాడు నాకో తిక్కుంది…దానికో లెక్కుందని..అలెక్క ఏమిటో పవన్‌కే తెలియాలి.
తను అధికారంలోకి వస్తాను అనే కాన్ఫిడెన్స్‌తో ఉంటే మాత్రం.. తనను ఎదుర్కొనడానికి ఆ పార్టీలన్నీ కలిసిపోతున్నాయని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం అతని రాజకీయ అజ్ణానానికి నిదర్శనం. ఇప్పటి వరకు పార్టీ నిర్మానమే జరగలేదు. అంతా ఒన్ మ్యాన్ షోలా పవన్ నడిపిస్తున్నారు.
పవన్ కల్యాణ్ బొత్తిగా ప్లాన్ లేకుండా జనాల్లోకి పోతున్నాడని.. ఇప్పటికే అనేకమంది రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఏమో అనుకున్నాం కానీ, ఈ మాటలు వింటుంటే మాత్రం పవన్ ఏం చెప్పదలుచుకున్నాడో ఆయనకు కూడా క్లారిటీ లేదని అనుకోవాల్సి వస్తోంది.
ఇక నారావారి పుత్రరత్నం లోకేష్. దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యి మంత్రిగా నిర్వాకం వెలగ బెడుతున్నారు. కనీసం తెలుగు పదాలు కూడా పలకలేని మంత్రి లోకేష్. ఆయన రాజకీయ పరిజ్ణానం గురించి చెప్పాల్సిన పనిలేదు. మహానాడులో లేకేష్ ప్రసంగం చూస్తే పవన్‌కు నేనేమి తక్కువ కాదని చేతులెత్తారు.
వచ్చే ఎన్నికల్లో మాకు వైసీపీ పోటీకాదని ప్రధాన ప్రతిపక్షం భాజాపాని ఆవేశంగా సెలవిచ్చారు పప్పుమంత్రిగారు. ఈ మేరకు సన్నద్ధం కావాలని తన శ్రేణులకు ఉద్బోదించాడు లోకేష్ బాబు. అవతల చంద్రబాబేమో బీజేపీకి ఏపీలో ఒక్క శాతం ఓటు బ్యాంకు లేదని అదే వేదికమీద సెలవిచ్చారు. ప్రజలను ఎంటర్‌టైన్ చేయడంలో ఇద్దరూ ఇద్దరే.
