Monday, May 20, 2024
- Advertisement -

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌పై చంద్ర‌బాబు ప్లాన్‌… జేపీకేనా…?

- Advertisement -

ఏదైనా విష‌యంలో మేలు చేస్తే చంద్ర‌బాబు నాయుడు వారికి రుణం తీర్చుకుంటారు. కానీ ఈ విష‌యం కేవ‌లం పార్టీ.. పాల‌న ప‌రంగా మాత్ర‌మే. ప్ర‌జ‌ల విష‌యాల్లో మాత్రం కాదు. ఓట్లేసి గెలిపించి చంద్ర‌బాబు అధికారంలోకి కూర్చొబెట్టిన ప్ర‌జ‌ల‌కు మాత్రం మేలు చేయ‌డ‌నే విష‌యం తెలిసిందే క‌దా.! అయితే ఇప్పుడు త‌న‌కు స‌హాయం చేసిన ఓ వ్య‌క్తికి ఏకంగా రాజ్య‌స‌భ ఇచ్చేందుకు నిర్ణ‌యం తీసుకున్నాడు.

అయితే ఈ విష‌యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసిన సిఫార‌సును కాద‌ని త‌న‌కు మేలు చేసిన వ్య‌క్తికి పెద్ద‌పీట వేస్తున్నాడు. ఆ రాజ్య‌స‌భ సీటు ఎవ‌రికి ఇస్తున్నాడంటే లోక్‌స‌త్తా వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ‌కు. చంద్ర‌బాబుకు, జేపీకి మ‌ధ్య స‌త్సంబంధాలు ఏర్ప‌డ‌డానికి కార‌ణం ఓ తెలుగు అగ్ర దిన‌ప‌త్రిక అధినేత వ‌ల్ల‌నే. జేపీ కాపు వ‌ర్గానికే చెంద‌డంతో న‌మ్మిన‌బంటుగా ఉంటున్నారు.

ప్ర‌స్తుతం ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్రారంభించిన జేఎఫ్‌సీలో జేపీ కీల‌క పాత్ర పోషించారు. చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఎక్క‌డా మాట రానీయ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. పంచాయితీలకు నిధులు కేటాయించాలంటేనే రాష్ట్ర ప్రభుత్వం సవాలక్ష లెక్కలు అడుగుతుంది. ఇస్తున్నది తమ రాష్ట్రంలోని పంచాయతీలకే అయినా.. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు అడుగుతుంది. ఆర్టీఐ ప్రకారం.. ప్రతి రూపాయికీ ప్రభుత్వం లెక్క చెప్పాల్సిందే. అయితే.. జేపీ మాత్రం కేంద్రం కేటాయించిన నిధులకు రాష్ట్రం లెక్కలు చెప్పనక్కర్లేదని తేల్చిచెప్పాడు. ఈ విధంగా చంద్ర‌బాబుకు స‌హ‌క‌రించారు.

గ‌తంలో జేపీ హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలో ఎమ్మెల్యేగా గెల‌వ‌డంలో ప‌రోక్షంగా చంద్ర‌బాబు స‌హ‌క‌రించారు. అప్పుడు చేసిన మేలుకు ఇప్పుడు జేపీ రుణం తీర్చుకోవ‌డంతో దీనికి చంద్ర‌బాబు ఆనందంలో ఉన్నారు. ఇప్పుడు అత‌డికి ఏకంగా రాజ్య‌స‌భ సీటు ఇవ్వ‌డానికి ఫిక్స‌య్యారు. అయితే రాజ్య‌స‌భ సీటు విష‌యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న అన్న చిరంజీవికి మ‌ళ్లీ ఒక ట‌ర్మ్ పొడిగించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. ఆ అవ‌కాశం మీరు ఇవ్వాల‌ని చంద్ర‌బాబును ప‌వ‌న్ కోరాడ‌ట‌. అయితే చిరంజీవికి రాజ్య‌స‌భ‌కు టీడీపీ త‌ర‌ఫున పంపిస్తే త‌న‌కు ఏం ప్ర‌యోజ‌నం అని ఆలోచించ‌గా బాబుకు ఏం క‌నిపించ‌లేద‌ట‌. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ సిఫార‌సును కాద‌ని చిరంజీవికి రాజ్య‌స‌భ స్థానం ఇవ్వ‌లేన‌ని నిర్ణ‌యించారు. ఆ స్థానంలో జేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు.

త్వరలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ కోటాలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ వాటాగా రెండు సీట్లు దక్కుతాయి. వాటిల్లో ఒకటి జేపీకి కేటాయించార‌ని తెలుస్తోంది. చంద్రబాబు చేయించుకున్న సర్వేల్లో జేపీని రాజ్యసభకు పంపడం ఉత్తమం అని తేలడంతో ఆ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -