Thursday, May 9, 2024
- Advertisement -

వైసీపీ మేనిఫెస్టో రిలీజ్..హైలైట్స్ ఇవే

- Advertisement -

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైసీపీ మేనిఫెస్టో వచ్చేసింది. 58 నెలల వైసీపీ పాలనలో ఇచ్చిన హామీలన్ని నెరవేర్చామని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్…పేదల సంక్షేమమే ధ్యేయమని ప్రకటించారు.

గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పామని …ఐదేళ్ల కాలంలో 99శాతం హామీలు అమలు చేశామని స్పష్టం చేశారు. రూ. 2లక్షల 70కోట్లను డీబీటీ ద్వారా అందించామని…కరోనా కాలంలోనూ సంక్షేమాన్ని ఆపలేదన్నారు. చంద్రబాబులా అమలు సాధ్యం కాని హామీలను ఇవ్వమని తెలిపారు జగన్. చనిపోయిన తరువాత ప్రతి పేదవాడి గుండెల్లో, ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండాలి అనేదే తన తాపత్రయం అన్నారు.

అబద్దాలతో చంద్రబాబుతో పోటీపడలేనని.. చేయగిలిగేవి మాత్రమే నేను చెబుతానని వెల్లడించారు. తన ప్రతీ అడుగు పేదవాడి అభివృద్ధి కోసమేనని…ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.

()అమ్మఒడి, ట్యాబ్ లు, విద్యా కానుక, గోరుమద్ద,ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన.
()ఆరోగ్య శ్రీ విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లీనిక్ లు, ఫ్యామిలీ డాక్టర్, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష
()రెండు విడతల్లో పెన్షన్ రూ.3,500 దాకా పెంపు.
() వైఎస్ఆర్ చేయూత రూ.75వేల నుంచి రూ. 1.50లక్షలకు పెంపు
()వైఎస్ఆర్ కాపు నేస్తం రూ.60వేల నుంచి రూ.1.20లక్షలకు పెంపు
()వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం రూ. 45వేల నుంచి రూ.1.5లక్షలకు పెంపు
()అమ్మఒడి రూ.15వేల నుంచి 17వేలకు పెంపు.. తల్లుల చేతికి రూ.15వేలు అందజేత
()వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద రూ. 3లక్షల రుణం
()వైఎస్ఆర్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కొనసాగింపు
()అర్హులైన ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగింపు.
()రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల భీమా, సున్నా వడ్డీ పంట రుణాలు, పగటి పూటే 9గంటల విద్యుత్, సమయానికే ఇన్ ఫుట్ సబ్సిడీ.
()జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, జగనన్న వసతి దీవెన జాబ్ ఓరింయంటెడ్ కర్కియంలో మార్పులు.
()నాడు – నేడు స్కూళ్లు, ఆస్పత్రులు
()అక్కచెల్లెమ్మల పేరిట ఇంటి స్థలాలు, ఇళ్లు.
()మహిళా సాధికారత..చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ
()పెన్షన్ కానుక, రెండు విడతల్లో 3,500కు పెంపు…ఇంటి వద్దకే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -