Saturday, May 4, 2024
- Advertisement -

పవన్ చూపు అటువైపే.. హింట్ ఇచ్చాడా ?

- Advertisement -

ఈ మద్య కాలంలో ఏపీ రాజకీయాల్లో జనసేన హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా అధికార వైసీపీ, జనసేన మద్య ముదురుతున్న రాజకీయ వివాదం హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతోంది. ప్రస్తుతం పవన్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పాలిటిక్స్ ను కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. గతంలో మాదిరిగా అధిక సమయం సినిమాలకు కాకుండా.. రాజకీయాలకు ఎక్కువగా కేటాయిస్తున్నారు. రైతు భరోసా యాత్ర, జనవాణి, వంటి కార్యక్రమాలు చేపడుతూ విస్తృతంగా ప్రజల్లో తిరుగుతున్నారు పవన్. ఫలితంగా జనసేనపై క్షేత్ర స్థాయిలో బలం పెంచుకుంటుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎలా ఉండబోతుంది అనే దానిపైనే ప్రదానంగా చర్చ నడుస్తోంది. .

అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన సింగిల్ గానే పోటీ చేయబోతుందా ? లేదా ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతుందా ? అనే దానిపై జనసేనాని ఇప్పటికీ కూడా స్పష్టత ఇవ్వలేదు. అయితే అధికారికంగా జనసేన బీజేపీతో పొత్తులో ఉందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏపీలో జనసేన సత్తా చాటలంటే బీజేపీకున్న బలం ఏమాత్రం సరిపోదు. ఎందుకంటే ఏపీలో బీజేపీకి బలం లేదనే విషయం తెలిసిందే. బీజేపీ జనసేనపై ఆధారపడింది గాని బీజేపీ వల్ల జనసేనకు ఒరిగేదంటూ ఏమి లేదు. దాంతో వైసీపీ వ్యతిరేక ఓటును చిలనివ్వకూడదు అంటూ జనసేన టిడిపితో పొత్తు పెట్టుకోవడం ఒక్కటే మార్గం. ఇక జనసేన టీడీపీ పొత్తు ఉంటుందని వైసీపీ పదే పదే విమర్శిస్తోంది.

కానీ ఈ పొత్తు విషయంలో అటు టీడీపీ గాని, ఇటు జనసేన గాని స్పష్టతనివ్వలేదు. అయితే ఆ మద్య విశాఖలో పవన్ తో చంద్రబాబు భేటి కావడంతో పొత్తు కన్ఫర్మ్ అనుకున్నారంతా. కానీ ఆ తరువాత మోడీతో భేటీ అయిన పవన్.. ఒక్క ఛాన్స్ అంటూ నినాదం అందుకోవడంతో టీడీపీతో పొత్తుకు పవన్ దూరమయ్యారా ? అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. కాగా తాజాగా సత్తెనపల్లిలో జరిగిన బహిరంగ సభలో పవన్ మరోసారి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో వైసీపీ వ్యతిరేక ఓటు చిలకూడదంటే టీడీపీతో కలవడమే జనసేన ముందున్న మార్గం. అలా చూస్తే.. టీడీపీతో జనసేన పొత్తు ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఎన్నికలు దగ్గర పడుతుండడంతో త్వరలోనే ఈ విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

కే‌సి‌ఆర్ జగన్ దోస్తీ.. ఇదే అసలు వ్యూహమా ?

బి‌ఆర్‌ఎస్ వైరస్.. బీజేపీ వ్యాక్సిన్ !

వాలెంటిర్లపై.. టీడీపీ ఫోకస్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -