Wednesday, May 1, 2024
- Advertisement -

ఏదోకటి గెలుక్కోవలనేనా ఈ రచ్చ..?

- Advertisement -

రాష్ట్రంలో జగన్ ఎంతో సమర్దవంతం గా పాలన అందిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.. మూడు రాజధానుల విషయంలో ఆయన చూపిస్తున్న దార్శనికత కి ప్రతి ఒక్కరు సమర్దిస్తున్నారు.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష తో ఆయన రాజధాని తరలిస్తునారని చెప్పి ఇప్పటికే విశాఖ కు రాజధాని ని తరలించారు.. మిగితా వ్యవహారాలలో కూడా జగన్ ఎంతో సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు.. ఎక్కడా ప్రతిపక్షాల విమర్శలకు తావు ఇవ్వకుండా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరీ అన్ని పనులు చేసుకుపోతున్నాడు..

పథకాల అమలుల విషయంలో అయినా, రాష్ట్రంలో వచ్చిన సమస్య పరంగా జగన్ ఎంతో నేర్పు తో పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నాడు.. అయితే ఇక్కడే ప్రతిపక్షాలకు జగన్ మీద అసూయ ఏర్పడింది.. ఎక్కడ తమకు ఛాన్స్ ఇవ్వకుండా జగన్ దూసుకుపోతుండడంతో రాష్ట్రంలో ఏదైనా సమస్య రాకపోద్దా అని గోతి కాడి నక్కల్లా వారు ఎదురుచుస్తున్నారట.. అయితే వారి ఎదురు చూపుకు అంతర్వేది లో రథం కాలిపోయిన విషయం దొరికినట్లయింది..

ఇక దొరికిందే తడవుగా ఆ విషయంలో ప్రభుత్వం తప్పు ఏమాత్రం లేకున్నా ప్రభుత్వాన్ని నిందించడం మొదలుపెడుతున్నారు.. దీన్ని పెద్ద ఇష్యూ చేసే పనిలో బీజేపీ, టీడీపీ పార్టీ లు పడ్డాయి.. అందుకు తగ్గట్లే సోము వీర్రాజు ఈమధ్య ఈ విషయంపై కొంత హడావుడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు.. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలోపేతానికి కొత్త అధ్యక్షుడు గా వచ్చిన సోము వీర్రాజు అవసరం లేకుండానే ఎదో తమ పార్టీ ఉనికి చాటుకోవాలని చెప్పి ఈ హడావుడి చేస్తున్నాడని ప్రజలకు తెలిసిపోతుంది. గుంటనక్కకు దొంగకోళ్ళు సాయమన్నట్లు చంద్రబాబు కూడా బీజేపీ ని ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ తో చేరి తాలాలు వాయిస్తున్నాడు.. వీరు అల్లర్ల పేరుతో మతాన్ని రెచ్చగొడుతున్నట్లు , అధిపత్యం పేరు తో అమాయక ప్రజలను బలితీసుకునేలా ఉన్నారు.. ఏదేమైనా అంతర్వేది విషయంలో వీరు చేసే ఈ హడావుడి ఎంతటి దారుణానికి దారితీస్తుందో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -