- Advertisement -

నాపై కుట్ర చేస్తున్నారు- పరిటాల శ్రీరాం

- Advertisement -

పరిటాల శ్రీరాం. ఇటీవల అనంతపురం జిల్లా వార్తల్లో ఆయన గురించి, ఆయన అనుచరుల గురించి పదేపదే కథనాలు వస్తున్నాయి. కిడ్నాప్‌లు, దౌర్జన్యాలు, భూకబ్జాలు చేస్తున్నట్టు పలు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన వ్యాపారి సలీంను కిడ్నాప్‌ చేసి చావబాది నాలుగు కోట్లు వసూలు చేశారన్న కేసులో పరిటాల శ్రీరాం ముఖ్య అనుచరులు భాస్కర్‌నాయుడు అరెస్ట్ కావడంతో కలకలం రేగింది.

ఇవన్నీ పరిటాల శ్రీరాం నేతృత్వంలోని ముఠానే చేస్తోందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పరిటాల శ్రీరాం వివరణ ఇచ్చారు. కిడ్నాప్‌లకు తనకు సంబంధం లేదన్నారు. తమ కుటుంబం విలువలతో బతుకుతోందన్నారు. తన వ్యక్తిత్వాన్ని హత్య చేసేందుకు వైసీపీ నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అరెస్ట్‌ అయిన నిందితులు తనతో ఫోటోలు దిగడంపైనా ఆయన స్పందించారు.

ఎవరెవరో సెల్ఫీలు దిగుతుంటారని… అంతమాత్రాన వారు చేసే నేరాలన్నింటికి తాము ఎలా బాధ్యత వహిస్తామన్నారు. సలీం అనే వ్యక్తిని తాను చూడలేదన్నారు. వ్యక్తిగత వివాదాలతో ఎవరో చేసే నేరాలను తనకు ఆపాదించవద్దన్నారు. మాజీ మావోయిస్ట్, పరిటాల రవి అనుచరుడు అయిన.. నాగూర్ హుస్సేన్ గ్యాంగ్ ద్వారా జిల్లాలో పది మందిని హత్య చేసేందుకు తాము ప్రయత్నించామంటూ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు.

నాగూర్‌ హుస్సేన్ లాంటి వారు కాంగ్రెస్‌ హయాంలో ఇబ్బందులు పడ్డారని.. కాబట్టి వారికి తాము అండగా ఉంటున్నామే గానీ.. వారిని వాడుకుని ఏదో చేయాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. చమన్‌ను పథకం ప్రకారం పరిటాల కుటుంబమే హత్య చేసిందని ఆరోపణలు రావడం.. దానిపై వివరణ ఇచ్చుకోవాల్సి రావడం చాలా బాధగా ఉందన్నారు. పరిటాల శ్రీరాంను రాజకీయంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కానీ తమపై వస్తున్న ఆరోపణలను నమ్మేందుకుప్రజలేమీ పిచ్చివాళ్లు కాదన్నారు పరిటాల శ్రీరాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -