- Advertisement -

హామీ నెర‌వేర్చ‌లేన‌ప్పుడు తప్పు ఒప్పుకోవాలి..

- Advertisement -

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ,చేశారు. అనంత‌పురం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌వ‌న్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. అధికార పక్షంలో ఉన్న పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిన పక్షంలో, ప్రజల ముందు తప్పు ఒప్పుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేర్చే పరిస్థితులు లేకపోవచ్చని, అలాంటప్పుడు, ప్రజలకు విషయం చెప్పాలని సూచించారు. ప్రత్యేక హోదా వంటి అంశాలపై వాస్తవాలను ప్రజల ముందు బయట పెట్టాలని కోరారు. విమ‌ర్శ‌లుకూడా బాబును ఇబ్బంది పెట్ట‌కుండా సున్నితంగా వ్యాఖ్య‌లు చేశారు.

ఇచ్చిన హామీల‌ను ఎట్టిప‌రిస్థితుల్లోనూ నెర‌వేర్చ‌కుంటే మ‌రో సారి ఓట్లు అడిగే హ‌క్కును కోల్పోతార‌ని హెచ్చ‌రించారు. పార్టీపేరును వెల్ల‌డించ‌కుండా మాట్లాడిన ఆయన, గొప్ప ఆశయాలతో, తాము చేయదలచుకున్న పనులతో మ్యానిఫెస్టోలను రాజకీయ పార్టీలు తయారు చేస్తుంటాయని, కొన్ని హామీలు నెరవేర్చే దిశలో కోర్టులు కూడా అడ్డు పడతాయన్న విషయం తనకు తెలుసునని చెప్పారు. తనకు ఎవరిపైనా ఆగ్రహం, ద్వేషం లేవని చెప్పిన ఆయన, అభివృద్ధే తనకు ధ్యేయమని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -