- Advertisement -

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పోలీసులు బిగ్ షాక్‌..

- Advertisement -

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలోని ధవలేశ్వరం బ్యారేజీపై ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న ‘జనసేన కవాతు’కు రాజ మహేంద్రవరం పోలీసులు అనుమ‌తిని నిరాక‌రించారు. ధవళేశ్వరం బ్యారేజీ పిట్ట గోడలు బలహీనంగా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ కారణంగానే తాము అనుమతిని నిరాకరిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘పోరాట యాత్ర’ నేడు తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో జన సైనికుల కవాతుకు పార్టీ ఏర్పాట్లు చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రిలోని పిచ్చుకలంక నుంచి కాటన్ విగ్రహం వరకూ 2.5 కిలోమీటర్ల మేర ఈ కవాతు సాగనుంది. ఈ క‌వాతులో దాదాపు 3 లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశముందనీ, కాబట్టి అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చిచెప్పారు. కాబట్టి బహిరంగ సభ కోసం మరో ప్రాంతాన్ని చూసుకోవాలని సూచించారు.

ఐతే ఇప్పటికే జనసేన నేతలు సభకు, కవాతుకు అన్ని ఏర్పాటు చేశారు. దాంతో అసలు జనసేన కవాతు జరుగుతుందా? లేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సాయంత్రం 5 గంటలకు కాటన్ బ్రిడ్జి దగ్గర బహిరంగ సభ జరగనుంది. ఆ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు. ఇక కవాతు సందర్భంగా విజ్జేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకు బ్యారేజ్‌ పొడవునా జనసేన జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బ్యారేజ్‌ దిగువన కాటన్‌ విగ్రహం సెంటర్లో బహిరంగ సభా వేదికను అందమైన పూలతో అలంకరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -