Sunday, May 12, 2024
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కోడిపుంజాట…!

- Advertisement -

గత ఆరు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఒక్కటే టాపిక్‌.. అదే వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం. ప్రతిపక్ష నేతపై ‘హత్యాయత్నం’ జరిగిందంటే, అధికార పార్టీ సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే, అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అనే చెప్పాలి. బాబు, ప్ర‌భుత్వాన్ని సామాన్య ప్ర‌జ‌లు, రాజ‌కీయ‌న‌య‌కులు అంద‌రూ ఏకి పారేస్తుంటే నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకుని.. ‘టాపిక్‌ని డైవర్ట్‌ చేయడానికి’ టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోడి క‌త్తి డ్రామాను బాగా న‌డిపించాడు.

జ‌గ‌న్‌పై దాడి వెనుక టీడీపీ నాయ‌కుల హ‌స్తం ఉంద‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టిన సంగ‌తి తెలిసిందే. రెండు పార్టీలు క‌త్తి దాడిని త‌మ ప్ర‌యోజ‌నాల‌కోసం బాగావాడుకున్నారు. గ‌త నాలుగు రోజులుగా క‌త్తి డ్రామా హంగామా జ‌రుగుతూనే ఉంది. వైసీపీ నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక టీడీపీ నేత‌లు ఎదురు దాడికి దిగారు. జ‌గ‌న్‌పై హ‌త్యా ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే బాబు త‌న యొల్లో బ్యాచ్‌ను పుర‌మాయించారు.

ఇంకే ముందు బాబు బ్యాచ్ ఎదురుడాడికి దిగ‌డం మొదలు పెట్టారు. జ‌గ‌నే కావాల‌నే చేయించుకున్నార‌ని ఏకంగా బాబే వ్యాఖ్యానించ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. మంత్రి సోమిరెడ్డి అయితే మేము ప్లాన్ వేస్తే వేరే విధంగా ఉంటాద‌ని బ‌హిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇక ఎంపీ కేశ‌నేని నాని అయితే టీడీపీ కార్య‌క‌ర్త‌లు తులుచుకుంటే జ‌గ‌న్ ఎప్పుడో కైమా అయ్యో వాడ‌ని విమ‌ర్శ‌లు చేశారు.

జ‌గ‌న్‌పై దాడి గ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత జగన్‌ని ఫోన్‌లో పరామర్శించేసి, వీలైతే ప్రత్యక్షంగా వెళ్ళి పరామర్శించి వుంటే.. చంద్రబాబు ‘హుందాతనం’ పెంచుకున్నట్లయ్యేది. ఆ తర్వాత రాజకీయ నాటకాలు.. వేరే వ్యవహారం. కానీ, ముఖ్యమంత్రి కాదు కదా.. మంత్రులు కూడా వైఎస్‌ జగన్‌ని పరామర్శించకపోవడం ఆశ్చర్యకరం.

ఇంకో ఆరునెలల్లో ఎన్నికలొస్తాయ్‌.. ఆ తర్వాత పరిస్థితులు ఎలా వుంటాయో ఎవరు చెప్పగలరు.? ప్రతిపక్ష నేతను పరామర్శిస్తే చంద్రబాబు హుందాతనమే పెరిగేది.. పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ మారి, జగన్‌ ముఖ్యమంత్రి అయితే.. చంద్రబాబు పరిస్థితి ఏంటి.?’ అన్న చర్చ టీడీపీలోనే జరుగుతోందంటే.. చంద్రబాబు డైరెక్షన్‌లో నడుస్తోన్న ‘కత్తి రాజకీయం’ ఏ స్థాయిలో టీడీపీ వైపుకు బూమరాంగ్‌ అవుతోందో అర్థం చేసుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -