గాంధీ కుటుంబం నుంచి రాజకీయ రణ క్షేత్రంలోకి దూకేందుకు మరో మహిళ సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు పరోక్షరాజకీయాలు నడిపిన సోనియా కుమార్తె, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ ప్రత్యక్షరాజకీయాల్లోకి రానున్నారు.
ఇప్పటి వరకు ప్రియాంక తల్లి సోనియా, రాహుళ్ పార్లమెంట్ నియోజక వర్గాల్లోనే ప్రచారం చేసేవారు. సోనియా ఆరోగ్యం క్షీనించడంతో తల్లి స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాయబరేలీ సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మరోవైపు, తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రకటించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్లో వ్యూహాత్మక పొత్తు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
మరోవైపు, శివసేనతో మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసి ముందుకు వెళ్లరాదని కాంగ్రెస్ తీర్మానించుకున్నట్టు సమాచారం. రెండు పార్టీల సిద్ధాంతాలు వేర్వేరు కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్లలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఫలితాల తర్వాతే ప్రకటించాలని కాంగ్రెస్ యోచిస్తోంది.
