Saturday, May 4, 2024
- Advertisement -

ఎన్డీఏలోకి వైసీపీ.. ముగ్గురికి మంత్రి పదవుల ఆఫర్

- Advertisement -

ఏపీ సీఎంగా అఖండ మెజార్టీతో గెలిచిన జగన్ మర్యాదపూర్వకంగా ప్రధాని మోడీని కలిశారు. కానీ ఆ తరువాత ఆశ్చర్యకరంగా అమిత్ షాను ఇంటికెళ్లి కలిశారు. మోడీ సూచన మేరకు జగన్ షాను కలిశారని వినికిడి. ఇక ఏపీ భవన్ కు వచ్చిన జగన్ తో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ గంటకు పైగా చర్చలు జరిపారు.

ఇవన్నీ పరిణామాలను దగ్గరుండి చూసిన వారు కేంద్రంలోని ఎన్డీఏలోకి వైసీపీని మోడీషాలు ఆహ్వానించారని.. కానీ జగన్ ప్రత్యేక హోదా సహా వివిధ డిమాండ్లపై హామీలభిస్తేనే చేరుతామని ప్రతిపాదన పెట్టారని ప్రచారం జరుగుతోంది. దీని కారణంగానే మోడీ ప్రమాణ స్వీకారానికి జగన్ ఈనెల 30న హాజరు కాబోతున్నారని చెబుతున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మూడు కేంద్రమంత్రులు ఇస్తామని మోడీషాలు వైఎస్ జగన్ ఎదుట ప్రతిపాదన పెట్టినట్టు తెలిసింది. వైసీపీ వర్గాల అంచనా ప్రకారం.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎస్పీ వర్గానికి చెందిన బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ కు జగన్ అవకాశం ఇస్తారని తెలుస్తోంది. విజయసాయిరెడ్డికి ఒక కేబినెట్ పదవి.. బాలశౌరి, సురేష్ లకు సహాయ మంత్రి పదవులు ఇస్తారని సమాచారం.

అయితే దీనిపై పార్టీలోని ముఖ్యులతో చర్చించి జగన్ రెండు రోజుల్లో చెప్పబోతున్నారని సమాచారం. అయితే టీడీపీ కూడా ఇలానే కేంద్రంలో చేరి తరువాత హామీలు నెరవేరక వైదొలిగి ఓడిపోయింది. ఇప్పుడు జగన్ కూడా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -