Sunday, May 12, 2024
- Advertisement -

మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్న నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారం…

- Advertisement -

రాష్ట్రంలో ఉన్న అంద‌రి చూపు ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక మీదె. అధికార‌,ప్ర‌తిప‌క్ష‌పార్టీలు ఎంత ప్ర‌తీష్టాత్మ‌కంగా తీసుకున్నాయంటె…చావో రేవో అన్న‌ట్లుగా తీసుకున్నాయి.ఎన్నిక‌లో ఎలాగైనా గెల‌వాల‌ని బాబు త‌న మంత్రివ‌ర్గ‌ప‌రివారాన్నంత నంద్యాల‌లోనే మోహ‌రించారు. ఇక ప్ర‌తిప‌క్ష వైసీపీకూడా త‌న శ‌క్తుల‌న్ని ఉప‌యేగించి త‌న స‌త్తా చాటేందుకు త‌హ‌త‌హ‌లాడుతోంది.

ఈ నెలాఖ‌రులోపు ఉప ఎన్నిక నోటిఫికేస‌ణ్ వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఇరు పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశాయి. ఇరు పార్టీల అభ్య‌ర్థులు ఖ‌రారు కావ‌డంతో హోరా హోరీ ప్ర‌చారం నోటిఫికేష‌న్ కి ముందే సాగుతోంది. వైసీపీ త‌రుపున శిల్పా మోహ‌న్ రెడ్డి అనుభ‌వాన్ని ఉప‌యోగించి ముందుకు సాగుతున్నారు. టీడీపీ త‌రుపున ఆ బాధ్య‌త‌ను మంత్రులు మోస్తున్నారు. భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి రాజ‌కీయాలు కొత్త‌. మంత్రి అఖిల ప్రియ‌కు ఎన్నిక‌లు కొత్త‌. దాంతో నంద్యాల బైపోల్స్ బాధ్య‌త సీనియ‌ర్ మంత్రుల‌కు త‌ప్ప‌డం లేదు.

అయితే నంద్యాల టీడీపీలో ఉన్న అస‌మ్మ‌తిని లేకుండా చేసేందుకు బాబు పావులు క‌దిపారు.మైనారిటీ ఓట్లు కీల‌కం కావ‌డంతో ఆపార్టీ ఫరూఖ్ కి ఎమ్మెల్సీ సీటు హామీను ఇచ్చారు.దీంతో ఆయ‌నలో ఉత్సాహాన్ని, ఆయ‌న వ‌ర్గంలో ఉత్తేజాన్ని నింపుతోంది.అయితే ఏవీ సుబ్బారెడ్డి వ్య‌వ‌హారం పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది.

వైసీపీకూడా ప్ర‌తీష్టాత్మ‌కంగా తీసుకున్న ఉప ఎన్నిక ప్ర‌చారంలో వైఎస్ సతీమణి విజ‌య‌మ్మను, కూతురు షర్మిలను బ‌రిలో దింపుతున్నారు. వీరిరువురూ నంద్యాల ఉప పోరులో వైసీపీ ప్రచార బాధ్య‌త‌లు స్వీక‌రించ‌బోతున్నారు. జ‌గ‌న్ జైలులో ఉన్న స‌మ‌యంలో ఉప ఎన్నిక‌ల ప్ర‌చార బాధ్య‌త‌లు నిర్వ‌హించిన అనుభ‌వం ఈ ఇద్ద‌రికీ ఉంది. దాంతో మ‌రోసారి విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల సాయంతో మ‌హిళా సెంటిమెంట్ అస్త్రాన్ని ఎదుర్కునే అవ‌కాశం ఉందంటున్నారు.

అటు టీడీపీకూడా భూమా కూతుళ్ళిద్ద‌రినీ టీడీపీ రంగంలో దించే ఆలోచ‌న ఉండ‌డంతో ఇటు వైసీపీ వైపు మ‌హిళా నేత‌ల ప్ర‌చారం ఖాయం అని అంటున్నారు.ఇప్పుడే ఇలా ఉంటె నామినేష‌న్‌ల త‌ర్వాత ప్ర‌చారం ఎలా ఉంటుందో ఉహించుకోవ‌చ్చు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -