Monday, May 13, 2024
- Advertisement -

చంద్రబాబుకు షాక్……. ఒక ఎమ్మెల్సీతో సహా వైకాపాలో చేరిన టిడిపి నాయకులు

- Advertisement -

2014 ఎన్నికల్లో వైకాపా ఓటమికి ప్రధాన కారణమైన ఒక జిల్లా విశాఖ. కడప రౌడీలు అంటూ అప్పట్లో విశాఖలో సాగించిన దుష్ప్రచారం ఫలించి టిడిపి నెగ్గింది. అయితే నాలుగేళ్ళ తర్వాత ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు విశాఖప్రజలు. గోదావరి జిల్లాల్లో కనిపించిన స్పందనకు మించి విశాఖలో ప్రజా స్పందన కనిపిస్తుండడం విశ్లేషకులను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది. ఇక ఏజెన్సీ ఏరియాల్లో కూడా టిడిపి నాయకుడిని అని చెప్తేనే ప్రజలు నిలదీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఏజన్సీతో సహా విశాఖ జిల్లా అంతా కూడా ఇప్పుడు టిడిపికి పూర్తి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.

ఈ పరిణామాలన్నింటినీ గమినించిన నాయకులు కూడా వరుసగా వైకాపాలోకి జంప్ చేస్తున్నారు. తాజాగా విశాఖలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్ సమక్షంలో ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు వైకాపాలో చేరారు. ఈ నాయకుడిని టిడిపి మద్దతుదారుడిగా ఉండమని చంద్రబాబు స్థాయిలో ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ కంతేటి సత్యనారాయణరాజు మాత్రం వైకాపాలో చేరడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. చదువుకున్నవాడు, అనుక్షణం ప్రజాక్షేత్రంలో ఉండే కంతేటి సత్యనారాయణరాజుకు విద్యావంతులు, మేధావుల్లో కూడా మంచి పేరు ఉంది. నాయకుడిగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న కంతేటి సత్యనారాయణరాజు చేరిక వైకాపాకు బలం చేకూరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కంతేటి సత్యనారాయణరాజుతో పాటు టిడిపి యూత్ నాయకులు, ఎంపిటీసీలు కూడా వైకాపాలో చేరారు. 2019 ఎన్నికల్లో విశాఖ జిల్లా అంతా కూడా టిడిపికి ఘోర ఓటమి ఖాయమని ఆయా నాయకులు వ్యాఖ్యానించారు. విశాఖలో చంద్రబాబు భూ మాఫియా దెబ్బకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని………విశాఖలో వనరులను దోచుకోవడం మినహా ప్రజలకు చంద్రబాబు చేసింది ఏమీ లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏజన్సీతో సహా విశాఖ ప్రజలందరూ కూడా టిడిపి నాయకులను నిలదీసే పరిస్థితులు వచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా వైకాపాకు పూర్తిస్థాయిలో కలిసొచ్చి 2019 ఎన్నికల్లో వైకాపా విజయబావుటా ఎగరేయడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ తరపున రెండు సార్లు విశాఖ నుంచి ఎంపిగా గెలిచిన ఒక సీనియర్ నాయకుడు మీడియా ముఖంగా వ్యాఖ్యలు చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -