Saturday, May 11, 2024
- Advertisement -

జగన్ కమిట్మెంట్… వైకాపాలో చేరాలనుకున్న టిడిపి మాజీ ఎమ్మెల్యేకు సూపర్ షాక్

- Advertisement -

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కంటే తన రాజకీయాలు ఏ రకంగా ప్రత్యేకమో మరోసారి నిరూపించాడు జగన్. పరిటాల రవిని జేసీ దివాకర్‌రెడ్డి హత్య చేయించాడని నానా యాగీ చేసిన చంద్రబాబు ఈ రోజు అదే జేసీని అధికారం కోసం తన పార్టీలో చేర్చుకుని అందలమెక్కించాడు. ఇక బ్యాంక్ రుణాలు ఎగవేసిన సుజనా చౌదరితో సహా రేప్ కేసులున్న టిడిపి ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఉన్నారు. మైనారిటీ ఉపాధ్యాయురాలిని హింసించిన సుశీలురు కూడా టిడిపి నాయకులే. అన్నింటికీ మించి కడుపు చేసేయడమే అన్న బాలకృష్ణ, అమ్మాయిలతో సరసాలు, మందు విందులతో అడ్డంగా దొరికిపోయిన లోకేష్‌లు టిడిపిలో ప్రముఖ నాయకులు. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం ఎవ్వరిపైనా చర్యలు తీసుకోడు.

అయితే జగన్ మాత్రం చంద్రబాబు తరహా రాజకీయాలకు తాను పూర్తి వ్యతిరేకం అని మరోసారి నిరూపించుకున్నాడు. 2014లో గిద్దలూరు నియోజకవర్గం నుంచి వైకాపా తరపున గెలిచిన నాయకుడిని టిడిపిలోకి ఫిరాయింపచేశాడు చంద్రబాబు. ఇప్పుడు అదే నియోజకవర్గం మాజీ టీడిపి ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైకాపాలో చేరడానికి ముందుకొచ్చాడు. రాంబాబును వైకాపాలో చేర్చుకుంటే కచ్చితంగా చంద్రబాబుపై జగన్ పైచేయి సాధించినట్టుగా అయ్యేది. కనీసం దెబ్బకు దెబ్బ కొట్టినట్టుగా ఉండేది. అయితే జగన్ మాత్రం అన్నా రాంబాబు చేరికను వద్దనేశాడు. అన్నా రాంబాబుపై క్రిమినల్ కేసులు ఉన్నాయని……అలాంటి నేతలు ఎంత పెద్ద వారైనా పార్టీలో చేర్చుకునేది లేదని తేల్చి చెప్పేశాడు జగన్. మహిళను వేధించిన కేసులో రాంబాబు దోషి అని కోర్టు కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అలాంటి నాయకుడు పార్టీకి అవసరం లేదని జగన్ చెప్పుకొచ్చాడు. పరిటాలను చంపేశాడని చెప్పి జేసీలపై నానా యాగీ చేసి అదే జేసీలను పార్టీలో చేర్చుకుని సీట్లిచ్చిన చంద్రబాబు తరహా రాజకీయాలు మనకు వద్దని నేతలకు చెప్పేశాడు జగన్. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నేతలకంటే ప్రజాబలాన్నే నమ్ముకుందామని చెప్పాడు జగన్.

రాజకీయం విషయంలో మాత్రం ఇప్పటికీ జగన్ నిజాయితీ గురించి టిడిపి నాయకులు కూడా అంతర్గతంగా చెప్పుకుంటూ ఉంటారు. చంద్రబాబులాగా సీటు ఇస్తానని చెప్పి, మంత్రిని చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పడం లాంటివి జగన్ ఎప్పుడూ చేయడని, మాట ఇస్తే నిలబడతాడని రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎంతటి క్రిమినల్ కేసుల్తో దోషి అయినప్పటికీ అధికారమే పరమావధిగా పార్టీలో చేర్చుకునే చంద్రబాబు తరహా రాజకీయం కాకుండా ప్రజాబలాన్ని నమ్ముకుని రాజకీయం చేయాలన్న జగన్ నిర్ణయం పట్ల కూడా వైకాపా నేతలు, శ్రేణులు కూడా గర్వంగా ఫీలవుతున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా ఈ విషయంలో జగన్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -