Tuesday, May 14, 2024
- Advertisement -

పార్టీలో ఉన్న‌అవినీతి ప‌రుల సంగ‌తేంటి….?

- Advertisement -

టీడీపీ నేత‌లు ప్ర‌తిప‌క్షంమీద విమ‌ర్శ‌లు చేసె వైఖ‌రి చాలా విచిత్రంగా ఉంటుంది. వాల్ల మాట‌లు చూస్తె అర‌ప‌చితుడు సినిమాలో హీరో విక్ర‌మ్‌కి ఉన్న స్ప్లిట్ పర్సనాలిటీలకు ఏమాత్రం తీసిపోరు. ఎప్పుడు నిప్పు అని డ‌బ్బాకొట్టుకొనె చంద్ర‌బాబుకి సొంత‌పార్టీ ఉన్న అవినీతి నాయ‌కుల గురించి మాత్రం మాట్లాడ‌రు. సొంత‌పార్టీలో ఉన్న బొక్క‌ల‌ను ప‌క్క‌న‌పెట్టుకొని ఎదుటి వాళ్ళ బొక్కలని బూతద్దంలో పెట్టి చూపిస్తుంటారు . జ‌గ‌న్ విష‌యంలో అయితె చెప్పాల్సిన ప‌నిలేదు అందరు ఒంటికాలిమీద లేస్తుంటారు.

తాజాగా వెలుగు చూసిన ప్యారడైజ్ పేపర్ల విషయంలో జరుగుతన్నది అదే. అసలా పనామా పేపర్లేంటో ఎవరికీ సరిగ్గా తెలీదు. అందులో ఏముందో కూడా పూర్తిగా ఎవరూ చూడలేదు. ప్యారడైజ్ పేపర్లలో ప్రపంచంలోని అవినీతిపరుల్లో కొందరు గురించి వివరాలున్నాయట. అందులో జగన్ అవినీతి గురించి కూడా ప్రస్తావన ఉందట. ఇంకేం కావాలి ఈ అపరిచితులకు.. పచ్చ మీడియా సహకారంతో రెండు రోజులుగా రెచ్చిపోతున్నారు.

ఇదంతా బాగానె ఉంది గాని పార్టీలోని యనమలరామకృష్ణుడు, సోమిరెడ్డిచంద్రమోహన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, కళావెంకట్రావు, కాలువశ్రీనివాసులు, బోండా ఉమ తెగ మాట్లాడేస్తున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వ‌స్తున్న స్పంద‌న‌ను చూసి త‌ట్టుకోలేక అదే సమయంలో ప్యారడైజ్ పేపర్లంటూ వార్తలు వెలుగు చూడటంతో మరీ రెచ్చిపోతున్నారు.

విచిత్రమేమిటంటే తమ పార్టీలో ఉన్న అవినీతిపరుల గురించి మాత్రం మాట్లాడరు. వాళ్ళ విషయాన్ని ఎవరైనా ప్రస్తావించినా ఘజనీ సినిమాలో హీరో లాగ మారిపోతారు. అక్ర‌మాస్తుల కేసులపై కోర్టులో విచార‌న జ‌రుగుతోంది జ‌గ‌న్ దోషినా లేక నిర్థోషినా అనేది కోర్టు తేల్చుతుంది. అంత‌కంటె ముందె ప‌చ్చ‌నాయ‌కులు జగన్ ను అవినీతిపరునిగా ముద్ర వేసేసి ఎంత శిక్ష పడుతుందో కూడా ఫైనల్ చేసేసారు.

జ‌గ‌న్‌ను విమ‌ర్శించే నేత‌ల‌కు కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపి రాయపాటి సాంబశివరావు, మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఎంఎల్సీలు వాకాటి నారాయణరెడ్డి, శ్రీనివాస్ లు బ్యాంకులను వందల కోట్లరూపాయలకు మోసం చేసిన వైనం గుర్తే ఉండదు. ఎంతోమంది టిడిపి ఎంఎల్ఏలు ఇసుక కుంభకోణంలో కోట్ల రూపాయలు సంపాదించినట్లు పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. అంతెందుకు ‘ఓటుకునోటు’ కేసులో సాక్షాత్తు చంద్రబాబునాయుడు రెడ్‌హ్యండెడ్‌గా దొరికి పోయారు. ఇవ‌న్నీ వ‌దిలేసి ఏదో ప్యార‌డైజ్ పేర్ల‌లో ఉన్న దాన్ని ప‌ట్టుకొని వేలాడ‌టం ప‌చ్చ‌పార్టీ నేత‌ల‌కె చెందుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -