Sunday, May 5, 2024
- Advertisement -

టీడీపీ కి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న టీడీపీ నేతలు..?

- Advertisement -

మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ పరిస్థితి చాల అధ్వాన్నంగా తయారైందన్న సంగతి తెలిసిందే.. ఒక్కొక్కరు గా టీడీపీ పార్టీ ని వీడుతూ చంద్రబాబు ను ఒంటరి చేస్తున్నారు.. వాస్తవానికి జగన్ ప్లాన్ కూడా అదే.. ఇప్పటివరకు తనమీద తీర్చుకున్న పగని జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఇలా పార్టీ కి ఒక్కొక్కరిని దూరం చేస్తూ పార్టీ పునాదులు లేకుండా చేస్తున్నాడని చెప్పొచ్చు.. ఇప్పటికే దాదాపు టీడీపీ లో మెయిన్ మెయిన్ లీడర్లు అందరు దూరమైపోయారు. ద్వితీయ శ్రేణి లీడర్లతో చంద్రబాబు తన పార్టీ ని నడిపించుకోవాలి.. ఇప్పుడు ఉన్న లీడర్లు కూడా వెళ్లిపోయేలా కనిపిస్తున్నారు..

తాజాగా  గల్లా అరుణకుమారి టీడీపీ పొలిట్ బ్యూరో నుంచి తప్పుకున్నారు. ఈమేరకు చంద్రబాబుకి ఆమె లేఖ రాసి తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించేశారు. దాంతో టీడీపీలో కొత్త చర్చ మొదలయ్యింది. ఇప్పటికే ఆమె తనయుడు గల్లా జయదేవ్ టీడీపీ పార్టీ ని వీడుతున్నట్లు వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి.. గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరం గా ఉంటున్నారు. చంద్రబాబు ను సైతం పెద్దగా పట్టించుకోవట్లేదు.. రాజ్యసభ లో చంద్రబాబు ఒకటి చెప్తే తాను మరొకటి చేస్తున్నాడు.. ఈ నేపథ్యంలో అయన తల్లి టీడీపీ పొలిట్ బ్యూరో నుంచి తప్పుకోవోడం కొంత అనుమానాలకు దారితీస్తుంది..

తమ ఆర్థిక, రాజకీయ అవసరాల కోసం గల్లా కుటుంబం కీలక నిర్ణయం తీసుకునే దిశలో సాగుతున్నట్టు కనిపిస్తోంది.దాంతో టీడీపీ కి వీరు వెళ్ళిపోతే ఎలాంటి గడ్డు పరిస్థితి ఎదురవుతుందో అని టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.. ఎంతైనా గుంటూరు లాంటి పెద్ద నియోజకవర్గంలో గల్లా లాంటి నేత జేరిపోతే ఏ పార్టీ కైనా ఇబ్బందే.. ఒకవేళ నిజంగానే గల్లా వెళ్ళిపోతే మాత్రం టీడీపీ కి ఆ నియోజక వర్గంలో కష్టకాలం ఎదురయ్యినట్లే అని చెప్తున్నారు.. మరి అసలే కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబు ఈ పరిస్థితి విని ఎలా తట్టుకుంటాడో చూద్దాం..  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -