- Advertisement -

ఆంధ్రజ్యోతి బ్రేకింగ్……. ఆ టిడిపి ఎంపి వైకాపాలో చేరతాడట

- Advertisement -

మహానాడు, నవనిర్మాణదీక్షలు అంటూ వసరుసగా పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నాడు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో టిడిపిదే గెలుపు అని ప్రజలను నమ్మించడానికి విపరీత ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా టిడిపి గెలుస్తుందన్న చంద్రబాబు మాటలు నమ్మకపోతూ ఉండడం చంద్రబాబును షాక్‌కి గురిచేస్తోంది. ఎప్పుడు ఏ నాయకుడు టిడిపిలో నుంచి వైకాపాలోకి జంప్ చేస్తాడో అని పచ్చ బ్యాచ్ మొత్తం ఆందోళన చెందుతున్న పరిస్థితి.

తాజాగా టిడిపి ఎంపి అవంతి శ్రీనివాస్ వైకాపాలో చేరడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడని బాబు భజన బృందం ప్రధాన పత్రిక ఆంధ్రజ్యోతి వార్తలు ఇస్తోంది. ప్రస్తుతం అనకాపల్లి నుంచి టిడిపి ఎంపిగా ఉన్న అవంతి శ్రీనివాస్ త్వరలోనే వైకాపాలో చేరనున్నాడట. భీమిలి నుంచి ఎమ్మెల్యే టికెట్ కూడా కన్ఫాం చేసుకున్నాడని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. భీమిలిలో గంటా శ్రీనివాసరావుపై పోటీ చేసి గెలుస్తానని జగన్‌కి హామీ ఇచ్చాడట అవంతి శ్రీనివాస్. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లోనే జగన్ ప్రజాసంకల్పయాత్ర సాగుతోంది. ఇదే సందర్భంలో టిడిపి సీనియర్ నేత, ఎంపి అయిన అవంతి శ్రీనివాస్ వైకాపాలో చేరితే మాత్రం అది చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ అవుతుందనడంలో సందేహం లేదు అన్నది విశ్లేషకుల మాట. టిడిపి శ్రేణులు కూడా పూర్తిగా డీలా పడే అవకాశం ఉంది. ఈ విపత్కర పరిస్థితిని బాబు అండ్ కో ఎలా ఎదుర్కుంటారో చూడాలిమరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -