Tuesday, May 14, 2024
- Advertisement -

వైసీపీ గెలిస్తే నిజంగా ప్ర‌జాస్వామ్యం ఉన్న‌ట్టే ….

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చ‌రాం యుద్ధం ముగిసింది. ఇరు పార్టీలు హోరాహోరీగా ప్ర‌చారాన్ని నిర్వ‌హించాయి. అది అంత‌టితో అయిపోయింది. ఇప్పుడు మిగిలింది లేక్క‌లు. మేం గెలుస్తాం, మేమే గెలుస్తాం.. నంద్యాల ఉప ఎన్నిక వేళ అధికార – ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చెబుతున్న మాట ఇదే. ఓట‌రు నాడి ఏంట‌నేది ఈవీఎంల‌లో నిక్ష‌ప్త‌మైపోతుంద‌నుకోండి.
గత కొద్ది రోజులుగా కంటి మీద కునుకు లేకుండా ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో కలియతిరిగారు. బరిలో నిలిచిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యుల సంగతి సరే సరి. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈలోగా, ప్రలోభాల పర్వం షరామామూలుగానే జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.
ఇంతకీ, నంద్యాల బరిలో విజేత ఎవరు.? ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం ఇప్పుడే చెప్పలేం. మాకు గెలుపు మీద ఎలాంటి డౌట్‌ లేదు.. మెజార్టీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం..’ అంటున్నారు ఇటు టీడీపీ నేతలు, అటు వైఎస్సార్సీపీ నేతలు. ఎవరికి వారు మెజార్టీ లెక్కల్ని 25 వేలకు పైగానే చెప్పుకుంటుండడం గమనార్హం.
ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడ్డ నంద్యాల ఉప ఎన్నిక చుట్టూ ప్రత్యేకమైన రాజకీయాలున్నాయన్నదీ ఓపెన్‌ సీక్రెట్‌. ఉప ఎన్నిక ప్రకటనకు త‌ర్వాత మొత్తంగా క్యాబినెట్‌ని నంద్యాలలో మోహరించడం తెల్సిన సంగ‌తే….ఇక వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయమే నంద్యాలకు తరలిపోయిందా.? అన్నట్టు అధినేత వైఎస్‌ జగన్‌ సహా ముఖ్య నేతలంతా నంద్యాలలోనే మోహరించారు.
ఎవ‌రు గెలుస్తార‌నేది ఇప్పుడే చెప్ప‌డం అంత ఈజీ కాదు. ప్ర‌చారంలో ఇద్ద‌రూ ఒక‌రితో ఒక‌రు పోటీ ప‌డ్డారు. గెలుపు మాత్రం ఒక్క‌రిదే అనేది స‌హ‌జం. అయితే ఎంత ప్ర‌చారం చేసినా డ‌బ్బు అనేది ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. వైసీపీ గెలిస్తే నిజంగా మొద‌టి సారిగా ప్ర‌జాస్వామ్యం బ్ర‌తికిన‌ట్లే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -